శశికళకు షాక్.. రూ.2000 కోట్ల ఆస్తులు ఫ్రీజ్

Update: 2020-10-07 17:45 GMT
తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు భారీ షాక్ తగిలింది. ఆమె జైలు నుంచి విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఐటీ శాఖ ఆమెకు కోలుకోలేని విధంగా చేసింది.

తాజాగా శశికళకు చెందిన రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులను బినామీ నిషేధిత చట్టం కింద అటాచ్ చేస్తున్నట్టు ఐటీ శాఖ పేర్కొంది. కొడనాడ్, సిరతపూర్ లో శశికళ, ఇళవరసి, సుధాకరణ్ పేరిట ఉన్న ఆస్తులను సీజ్ చేశారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు నోటీసులు అంటించారు.

వీటిలో 300 కోట్ల విలువైన రెండు ఆస్తులున్నాయి. స్తంభింపచేసిన ఆస్తులను ఆదాయపన్ను శాఖకు చెందిన అధికారులు గుర్తించారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతోపాటు ఇళవరసి, సుధాకరణ్ కూడా జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. శిక్షాకాలం ముగిసి వచ్చే ఏడాది జనవరిలో శశికళ విడుదల కానున్నట్టు సమాచారం. స.హ. చట్టం దరఖాస్తు ద్వారా ఈ విషయం వెలుగుచూసింది.
Tags:    

Similar News