రూ.800 కోట్ల బ్లాక్ దందా చేసిన రియల్ ఎస్టేట్ పేర్లు చెప్పిన ఐటీశాఖ

Update: 2022-01-11 03:58 GMT
గడిచిన రెండు.. మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లల్లో.. ఆఫీసుల్లో పెద్ద ఎత్తున ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా గుసగుసలు వినిపించాయే కానీ.. వాటికి సంబంధించిన వివరాలు మాత్రం విడుదల కాలేదు. ఈ కారణంతోనే ఐటీ శాఖ దాడులు చేసిన తర్వాత కూడా సదరు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన వివరాలు ఏమీ బయటకు రాలేదు. ఈ కొరతను తీరుస్తూ.. ఎప్పుడు లేని రీతిలో ఐటీ శాఖ తాజాగా తాము దాడి చేసిన వివరాలతో పాటు.. మోసానికి పాల్పడిన రియల్ ఎస్టేట్ సంస్థల పేర్లను విడుదల చేశారు.

ఐటీ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారు ఏకంగా రూ.800 కోట్ల అక్రమపు నగదు చెలామణీకి పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ తో పాటు అనంతపురం.. తాడిపత్రి.. బెంగళూరులోనూ సోదాలు నిర్వహించారు.

ఈ క్రమంలో అనేక బ్లాక్ లావాదవీలను అధికారులు గుర్తించినట్లుగా చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీగా సోదాలు నిర్వహించగా.. రూ.800 కోట్ల అక్రమ లావాదేవీల్ని గుర్తించినట్లుగా పేర్కొంది. సాధారణంగా ఐటీ సోదాలు నిర్వహించిన సందర్భంలో.. సోదాలు చేసిన కంపెనీల పేర్లు ఓపెన్ చేయరు. కానీ.. తాజాగా ఐటీ శాఖ మాత్రం.. ఆ వివరాల్ని కూడా వెల్లడించారు.

ఐటీ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. నవ్య డెవలపర్స్.. రాగమయూరి లాంటి బిల్డర్ంలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లోటుపాట్లు ఉన్నట్లు గర్తించారు. దీంతో వారికి నోటీసులు జారీ చేసి.. అసలు సూత్రధారుల గురించి ఆరా తీయటం మొదలు పెట్టారు. ఏమైనా తాజా సోదాల్లో భారీగా నగదు బయటకు రావటంతో.. ఇప్పుడు సంచలనంగా మారింది.
Tags:    

Similar News