చైనా ఏజెంట్ల నీచం.. జర్నలిస్టును వేశ్య పేరుతో హింసిస్తున్నారట

Update: 2023-04-07 05:00 GMT
చైనా పగబడితే ఎంతలా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎంతటి అత్యుత్తమ స్థానంలో ఉన్నా ఎన్ని వేల కోట్లు ఉన్నా వారిని ఊరికించి ఊరికించి వేధింపులకు గురి చేయటమే కాదు. వారిని దారుణంగా అవమానించే వైఖరిలో వారికి మించినోళ్లు ఉండరన్న విషయంలో మరో మాటకు అవకాశం లేదు. తాజా ఉదంతంగురించి తెలి స్తే.. డ్రాగన్ దుర్మార్గం ఎంతలా ఉంటుందన్న విషయం కళ్లకుకట్టినట్లుగా కనిపించక మానదు.

చైనా కు చెందిన పాత్రికేయురాలు సూ యుటాంగ్ ను టార్గెట్ చేసిన చైనా ఏజెంట్లు ఆమెను ఎంతలా వేధింపులకు గురి చేస్తున్నారో తెలిస్తే.. నోట మాట రాదు. ఆమె జర్మనీలో ఉన్నప్పటికీ ఆమెకు మాత్రం నిత్య నరకాన్ని చూపిస్తుండటం గమనార్హం. ఎందుకంటే ఆమె ఇంటి తలుపు తట్టి మీరు వేశ్య కదా? అంటూ రోజువారీగా అడిగే వారితో ఆమెకు సమాధానం చెప్పలేక పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. ఇదంతా ఎందుకంటే 1989లో బీజింగ్ లోని తియాన్మిన్ స్వ్కేర్ లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనను అక్కడి చైనా ప్రభుత్వం ఎంత కఠినంగా తొక్కేసిందో తెలిసిందే.

చైనా చర్యను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులు ముక్త కంఠంతో ఖండించటమే కాదు. డ్రాగన్ తీరుకు నిరసనగా ర్యాలీలు నిర్వహించారు. అలాంటి నిరసన ర్యాలీ ఒకటి జర్మనీలో జరిగింది. దీనికి సదరు పాత్రికేయురాలు సూ యుటాంగ్ యాక్టివ్ గా పాల్గొనటంతో ఆమె వారికి టార్గెట్ గా మారారు.  అయితే వారి దాడి నేరుగా సూటిగా ఉండకుండా తాము టార్గెట్ చేసిన వారి వ్యక్తిత్వం డ్యామేజ్ అయ్యే చర్యల్ని చేపడుతుంటారు. సదరు మహిళా పాత్రికేయురాలి విషయంలోనూ అలానే జరిగింది.

ఆమె ఫోన్ నెంబరును, అడ్రస్ ను సోషల్ మీడియాతో పాటు. ఆన్ లైన్ లో ఉంచేసి ఆమెను వేశ్యగా అభివర్ణిస్తూ ప్రచారం చేపట్టారు. దీంతో సదరు సోషల్ మీడియా ఖాతాకు బెదిరింపులు రావటంతో ఆమె ఆ ఖాతాను మూసేశారు. అయినప్పటికీ ఆగని చైనాఏజెంట్లు. ఆమె ఫోన్ నెంబరుకు మీరు వేశ్య కదా? అంటూ మేసేజ్ లు పంపేలా చేయటం. ఇంటి తలుపు కొట్టి వేధింపులకు దిగుతున్నారు.

తనకు ఎదురవుతున్న చేదు అనుభవాల్ని ఆమె జర్మనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయినప్పటికీ చైనా ఏజెంట్లు తగ్గట్లేదు. ఆమె ఫోటోల్ని మార్పింగ్ చేసి ఆన్ లైన్ లో పెట్టి ఎస్కార్టు సేవల్ని అందిస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలా తాము టార్గెట్ చేసినోళ్లు నిత్యం కంటినిండా నిద్ర పోలేని రీతిలో వారిని సమాజంలో వేధింపులకు గురి చేసే వైనం తాజాగా బయటకు వచ్చి. డ్రాగన్ దుర్మార్గం ఎంతలా ఉంటుందన్న విషయం మరోసారి ప్రపంచానికి అర్థమయ్యేలా చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News