ఆ మంత్రి మెత‌క వైఖ‌రి.. పార్టీని ఇబ్బంది పెడుతోందా..?

Update: 2021-09-01 09:30 GMT
ఆయ‌న చాలా సున్నిత‌మైన నాయ‌కుడు. ఒక‌రిని విమ‌ర్శించ‌రు. ఆయ‌న‌ను విమ‌ర్శించేలా ఎప్పుడూ వ్య‌వ‌హ‌రించ‌రు. ఒక‌వేళ ఏదైనా అనాల్సి వ‌చ్చినా.. ప‌ద్ధతిగా, హుందాగా వ్య‌వ‌హ‌రిస్తారు. దీంతో ఆయ‌న ప‌రిస్థితి ఎలా ఉన్నా.. పార్టీ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో మంత్రి ప‌నితీరు విష‌యంలో మంచి గ్రాఫ్ ఉన్న‌ప్ప‌టికీ.. దూకుడు విష‌యంలో మాత్రం క‌నిపించ‌డం లేద‌ని.. వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఇది పార్టీకి ఆయ‌న‌కు మ‌ధ్య గ్యాప్ కూడా పెంచుతోంద‌ని అంటు న్నారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే!

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా అంటేనే రాజ‌కీయాల‌కు పెట్ట‌ని కోట‌. ఫైర్ బ్రాండ్ నేత‌ల‌కు పుట్టిల్లు. అలాంటి చోట ఏలూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌.. ఉర‌ఫ్ నాని.. ప‌రిస్థితి ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెన‌క్కి అన్నచందంగా ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న కీల‌క‌మైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ప‌నితీరు ప‌రంగా ఆయ‌న‌కుతిరుగులేదు. వివాదం లేదు. వివాదాస్ప‌దం కాదు.. అన్న‌ట్టుగానే ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిజానికి ఆయ‌నకు గ‌త ఏడాది ఈ ఏడాది కూడా క‌రోనా ప‌రీక్ష పెట్టింది.

అయినా కూడా నాని దిగ్విజ‌యంగా విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌న ప‌నితీరును మెరుగుప‌రుచుకుని.. సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులే పొందారు. అయితే.. ఎటొచ్చీ.. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గం స‌హా.. చుట్టు ప‌క్క‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని బ‌లోపేతం చేయ‌డంలోనే ఆయ‌న వెనుక‌బ‌డుతున్నార‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ఒక‌ప్పుడు బ‌లంగా ఉన్న టీడీపీ ఇప్పుడు చేతులు ఎత్తేసింది. కీల‌క నేత‌లు అంద‌రూ సైలెంట్ అయ్యారు. ఈ స‌మ‌యంలో వైసీపీని పుంజుకునేలా చేసి, కార్య‌క‌ర్త‌ల సంఖ్య‌ను పెంచుకునే విష‌యంలో మంత్రి స‌క్సెస్ కాలేక పోతున్నార‌ట‌.

అంతేకాదు.. అస‌లు పార్టీపై ఆయ‌న దృష్టి పెట్ట‌లేక పోతున్నార‌నేది.. కార్య‌క‌ర్త‌లు చెబుతున్న‌మాట‌. ``ఇప్పుడు పార్టీ పుంజుకునే అవ‌కాశం ఉంది. అయినా.. మా మంత్రి గారు ఎక్క‌డా మాకు అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌డం లేదు. ఎవ‌రితోనూ మాట్లాడ‌డం లేదు. క‌నీసం క‌లెక్ట‌రేట్‌లో అయినా.. క‌లుద్దామ‌న్నా.. ఒక‌టి రెండు నిమిషాలు త‌ప్ప స‌మ‌యం ఇవ్వ‌డంలేదు. ఆయ‌న పేరు బాగున్నా.. పార్టీ డెవ‌ల‌ప్ అవ్వాలంటే.. ఎంతో కొంత చేయాలి క‌దా!`` ఎవ‌రిని ప‌ల‌క‌రించినా ఇదే వినిపిస్తోంది. ఈ ప‌ర‌స్థితి మారి .. క‌నీసం వారం లో ఒక్క‌రోజైనా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టిపెట్టాల‌ని.. కార్య‌క‌ర్త‌లు కోరుతున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా ఆయ‌న త‌న షెడ్యూల్ మార్చుకుంటారో లేదో చూడాలి.


Tags:    

Similar News