చావడానికి సాయం..ఇదో వెరైటీ.. 9 మందిని చంపిన కిల్లర్

Update: 2020-10-02 00:30 GMT
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2011 లో రానా హీరోగా, ఇలియానా హీరోయిన్ గా 'నేనూ నా రాక్షసి ' అనే మూవీ వచ్చింది గుర్తుందా..ఆ సినిమాలో హీరోయిన్ ఇలియానా చనిపోతున్న వారి వీడియోలు తీస్తా ఉంటుంది. చనిపోవాలని నిర్ణయించుకున్న వాళ్లు ఆన్ లైన్ ద్వారా సంప్రదిస్తే ఇలియానా వెళ్లి వివిధ పద్ధతుల్లో చనిపోతున్న వారి వీడియోలు  తీసి ఆన్ లైన్ ల్లో పెడుతుంటుంది. వాటిని సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. ఆ సినిమా చూసిన వాళ్లంతా ఇదేమి  వెరైటీ  రా బాబు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు దాదాపు ఇలాగే జపాన్ లో సంఘటనలు జరిగాయి.

సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని తొమ్మిది మందిని హత్యచేసిన జపాన్ ట్విట్టర్ కిల్లర్‌ తకాహిరొ షిరాయిషిని న్యాయస్థానంలో బుధవారం ప్రవేశపెట్టారు.

కాగా బాధితుల సమ్మతితోనే ఈ హత్యలు చేశాడని నిందితుడి తరఫు లాయర్ వాదిస్తుండటంతో అంతా ఆశ్చర్య పోతున్నారు.

ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు  ట్విట్టర్ ద్వారా అతడితో పంచుకోవడం వల్లే నిందితుడు హత్యలకు పాల్పడ్డాడని లాయర్ కోర్టులో  వాదించాడు.

మానసికంగా కుంగి పోయి  ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధంగా ఉన్న15-26ఏళ్ల మధ్య  వయస్సు ఉన్నవారిని నరహంతకుడు షిరాయిషి ట్విట్టర్ ద్వారా సంప్రదించినట్టు  జపాన్ లో ఆరోపణలు ఉన్నాయి. ఆత్మహత్య చేసుకునేందుకు సహాయం చేస్తానని తాను కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని దగ్గరై హత్యలు చేసాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్యలకు సంబంధించి షిరాయిషిపై పలు కేసులు నమోదయి ఉన్నాయి. ఆరోపణలు నిజం..అని తేలితే అతడికి ఉరి శిక్ష విధిస్తారు. నిందితుడి తరపు లాయర్ మాత్రం షిరాయిషి తనను సంప్రదించి తాము చావాలనుకుంటున్నాం..అని సహాయం కోరిన వాళ్లనే చంపాడని..అతడికి నామ మాత్రపు శిక్ష విధించాలని కోర్టుకు విన్నవించాడు. అయితే ఆశ్చర్యంగా నిందితుడు షిరాయిషి మాత్రం హత్యలను తానే చేశానని..వారే సాయం కోరలేదని  ప్రకటించాడు.

 తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్టు ట్విట్ చేసిన ఓ 23 ఏళ్ల మహిళ ఆ తర్వాత  కనిపించకుండా పోవడంతో మూడేళ్ల కిందట షిరాయిషి వరుస హత్యల గురించిన విషయాలు  బయటపడ్డాయి.

ఓ  మహిళ కనిపించకుండా పోగా ఆమె సోదరుడు అనుమానం వచ్చి ఆమె ట్విట్టర్ ఖాతాను పరిశీలించగా..తాను చనిపోవాలని నిర్ణయించుకుని అందుకు మరొకరి సాయం తీసుకున్నట్లు అర్థమైంది.  దీంతో అతడు దీనిపై  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న 9 మంది  ట్విట్టర్ ద్వారా షిరాయిషీని సహాయం కోరగా అతడు వారిని హత్య చేసి  తన ఇంటి కింది భాగంలో ఓ రహస్య గదిలో మృతదేహాలను ఉంచినట్లు  పోలీసులు గుర్తించారు. అందులో ముక్కలుగా చేసిన శరీర భాగాలు, 240 ఎముకలను ఫ్రిజ్ బాక్సుల్లో దాచి ఉంచడం గుర్తించారు.
Tags:    

Similar News