మిగిలిన పార్టీలకు భిన్నంగా వ్యవహరిస్తుంటుంది కాంగ్రెస్ పార్టీ. మారిన కాలానికి తగ్గట్లు తమ పద్దతుల్ని మార్చుకోవటానికి బదులుగా.. పాత విధానాల్ని కంటిన్యూ చేస్తూ.. మిగిలిన వారికి భిన్నమన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది. అదంతా కాలయాపన.. అనవసరమైన కసరత్తు అన్న విమర్శల్ని పట్టించుకోదు. ఫార్సుగా సాగినా.. దాన్నే పెద్ద పనిగా చూపించుకోవటం కాంగ్రెస్ కు మాత్రమే సాధ్యమయ్యే వ్యవహారం.
తాజాగా.. కొత్త టీపీసీసీ అధ్యక్షుడ్ని ఎంపిక చేసేందుకు గడిచిన నాలుగైదు రోజులుగా రాష్ట్ర పార్టీ బాధ్యుడు మాణిక్యం ఠాగూర్ కసరత్తు చేస్తున్నారు. పలువురు నేతల్ని పిలిచి.. వారి అభిప్రాయాన్ని కనుక్కుంటున్నారు. అంతిమంగా ప్రకటించే పేరు మీద రచ్చ ఖాయమైనప్పటికి.. అందరి అభిప్రాయాలు తీసుకున్నమన్న మాట కోసం చేస్తున్న కసరత్తు టైం వేస్ట్ ప్రోగ్రాం అని తప్పు పట్టేవారెందరో.
ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లాకు సంబంధించి పార్టీలో కీలకమైన నేతలుగా పేరున్న కొండా సురేఖ దంపతులు మాణిక్యంతో భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో తాము బీజేపీలోకి వెళ్లాలనుకోవటం లేదని.. పార్టీలోనే ఉంటామని హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. కొండా దంపతుల భరోసాకు స్పందనగా.. వారికి కీలక బాధ్యతను అప్పజెప్పినట్లుగా తెలుస్తోంది.
త్వరలో జరిగే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. వారు ఎంపిక చేసిన అభ్యర్థులకు టికెట్లు దక్కుతాయని.. పార్టీ ప్రతిష్ఠ పెరిగేలా ఎంపిక ఉండాలని సూచన చేశారు. తమ హామీకి.. తగ్గ భరోసా లభించటంకొండా దంపతులకు కొండంత ఊరటను ఇచ్చిందని చెబుతున్నారు.