ఏపీ అసెంబ్లీలో తాజా ఆంక్ష‌లు.. ప్ర‌భుత్వాన్ని కాపాడేందుకేనా?

Update: 2022-03-17 11:19 GMT
ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం.. తాజాగా కొన్ని ఆంక్ష‌లు విధించారు. దీనిపై స‌ర్వత్రా ఆస‌క్తి నెల‌కొంది. మేధావులు మాత్రం.. ఈ చ‌ర్య‌ను ప్ర‌భుత్వాన్నికాపాడేందుకే.. ఈ ఆంక్ష‌లు విధించార‌ని అంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. తాజా జంగారెడ్డి గూడెంలో జ‌రుగుతున్న వ‌రుస మ‌ర‌ణాల‌ ఘటనల పై సీఎం చేసిన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి పై టీడీపీ నోటీసు ఇచ్చింది. ఆ నోటీసు ను స్పీకర్ తిరస్కరించారు. ఆ సందర్భంలో సీఎంను ఉద్దేశించి టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా వైసీపీ సభ్యులు సీరియస్ అయ్యారు.
 
ఈ స‌మ‌యంలో పోడియంను చుట్టుముట్టిన టీడీపీ  సభ్యులు చప్పట్లు కొట్టారు. తమ గోడు వినిపించుకోవ డం లేదంటూ నినాదాలు చేస్తూ...ఆ తరువాత చప్పట్లు కొట్టారు. టీడీపీ సభ్యులు చప్పట్లు కొట్టడం ఏంటని స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరం తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జే బ్రాండ్స్ మద్యం, నాటుసా రాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ సమావేశాలకు ముందు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నేప‌థ్యంల స్పందించిన  స్పీకర్ సీతారాం.. తాజాగా రూలింగ్ ఇచ్చారు.

సభలో సభ్యుల మొబైళ్లకు అనుమతి లేదని స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. సభ్యులు సభా సంప్రదాయాలను పాటించాలన్నారు. దీనికి టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ గందరగోళంతో సభలో ఉన్న టీడీపీ సభ్యులను ఈ ఒక్క రోజు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే.. ఈ ఘ‌ట‌న‌పై మేధావులు సైతం స్పందించారు. స‌భ‌లోకి సెల్ ఫోన్లు తీసుకువెళ్ల‌కూడ‌ద‌నే రూలింగ్ అనేది ఎక్క‌డా లేద‌న్నారు. అంతేకాదు.. స‌భ‌లో విప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న చేయ‌డం కూడా ఇప్పుడు కొత్త‌కాద‌ని పేర్కొంటున్నారు.

కానీ, ఇప్పుడు కొత్త‌గా స్పీక‌ర్ విధించిన నియ‌మాలు చూస్తే.. ఆయ‌న కేవ‌లం అధికార పార్టీని ర‌క్షించేందు కు మాత్రమే ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌నే అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని మేధావులు పేర్కొంటున్నారు. సాధార‌ణంగా.. స‌భ‌ల్లో న‌ర‌స‌న తెలిపే హ‌క్కు.. విప‌క్ష స‌భ్యుల‌కు ఉంటుంద‌ని.. అన్ని అసెంబ్లీల్లోనూ ఉన్న‌దేన‌ని చెబుతున్నారు.

అసెంబ్లీ రూల్స్‌కు విరుద్ధంగా ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం అంటే.. ప్ర‌జాస్వామ్యంలో విప‌క్షాల‌కు వాయిస్ లేకుండా చేయ‌డ‌మేన‌ని.. మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి దీనిపై స్పీక‌ర్ ఏమంటారోచూడాలి.
Tags:    

Similar News