తెలుగుదేశం పార్టీలో మొదలైన తాజా సంచలనమంతా లోకేష్ టార్గెట్ గా జరుగుతున్నట్లు సమాచారం. వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, సీనియర్ ఎంఎల్ఏ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా అస్త్రం పార్టీలో సంచలనంగా మారింది. ఈనెల 25వ తేదీన పార్టీకి, ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసేయాలని తాను డిసైడ్ అయినట్లు తన సన్నిహితులతో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బుచ్చయ్య నిర్ణయం తెలియగానే చంద్రబాబునాయుడు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత కూడా గోరంట్ల నిర్ణయంలో మార్పు రాలేదని తెలుస్తోంది.
బుచ్చయ్య నిర్ణయానికి కారణాలు ఎన్ని ఉన్నా తన సీనియారిటీకి చంద్రబాబు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదన్నది ముఖ్యంగా కనబడుతోంది. తాను ఫోన్ చేస్తే చంద్రబాబు, లోకేష్ అసలు రెస్పాండ్ కావటం లేదన్నది ప్రధాన ఆరోపణ గా వినిపిస్తోంది. తనంతటి సీనియర్ ఫోన్ చేస్తే తండ్రి, కొడుకులు ఫోన్ తీయకపోవటం ఏమిటనే బాధ గోరంట్లలో బాగా పెరిగిపోయిందట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తమను చంద్రబాబు నిర్లక్ష్యం చేసినా సీనియర్లు ఎలాగో సహించగలరు కానీ లోకేష్ నిర్లక్ష్యం చేస్తే మాత్రం తట్టుకోలేరు.
లోకేష్ వ్యవహార శైలితో బుచ్చయ్య అసంతృప్తి ఇపుడు పార్టీలో చర్చ జరుగుతోంది కానీ గతంలో కూడా ఇదే విషయాన్ని చాలామంది ప్రస్తావించారు. మరో సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి పార్టీ ఆఫీసులో లోకేష్ ను కలుద్దామని అనుకుంటే అపాయింట్మెంట్ లేనిదే తాను ఎవరినీ కలవనని తన పీఏ ద్వారా చెప్పించారట. దాంతో ఒళ్ళుమండిపోయిన జేసీ ఆ తర్వా తెప్పుడూ లోకేష్ ను కలవడానికి ప్రయత్నం చేయలేదని సమాచారం.
అలాగే స్పీకర్ గా పనిచేసిన మరో సీనియర్ నేత ప్రతిభా భారతి కూడా లోకేష్ కలుద్దామని ప్రయత్నిస్తే కుదరలేదట. పార్టీ ఆఫీసులో గంటలపాటు వెయిట్ చేసినా ప్రతిభకు నిరాశే ఎదురైందట. తనను కలవడానికి లోకేష్ ఇష్టపడకపోవటంతో ప్రతిభ కన్నీళ్లు పెట్టుకుని చివరకు పార్టీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయినట్లు పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ ఘటనలు చంద్రబాబుకు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదట.
తాను మంత్రిగా ఉన్న సమయంలో కలవడానికి తన చాంబర్ కు వచ్చిన కొందరు మంత్రులను కూడా లోకేష్ గంటల తరబడి వెయిట్ చేయించిన ఘటనలు చాలానే ఉన్నాయని ప్రచారంలో ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలామంది సీనియర్లు చంద్రబాబు అధికారాన్ని ఆమోదించగలుగుతున్నారు కానీ లోకేష్ ను సహించలేకపోతున్నారు.
తమ కళ్ళముందు పుట్టి పెరిగిన లోకేష్ తమను నిర్లక్ష్యం చేయటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే పార్టీని వదిలి వెళ్లిపోయిన నేతల్లో చాలామంది లోకేష్ ను దుమ్మెత్తిపోసిన విషయం తెలిసిందే. కాబట్టి ఇఫుడు బుచ్చయ్య చౌదరి టార్గెట్ కూడా లోకేషే అని అర్థమవుతోంది. మరి చంద్రబాబు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.