కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అత్యున్నత స్థానాల్లో వెలిగిపోయినోళ్లు.. ఆ తర్వాతి కాలంలో పావలాకుపని చేయని వారిగా మారిపోతుంటారు. అదంతా కాల మహిమే అనుకుంటే తప్పే. ఎందుకంటే.. ప్రముఖులుగా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకున్నోళ్ల కక్కుర్తి.. బుద్ధి తక్కువ పనులతో వారికున్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది.
వారు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నదంతా పోతుంది. చేసినోడికి చేసినంత అన్న సామెతకు తగ్గట్లే వారి జీవితం ఉంటుంది. దిగ్గజ ఆటగాడిగా.. అరవై చివర్లో పుట్టినోళ్లు మొదలు ఎనభైలు మొదట్లో పుట్టినోళ్ల వరకు.. టెన్నిస్ ను ఇష్టపడే వారంతా తెలీకుండా టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు బోరిస్ బెకర్ కు.. అతని ఆటకు ఫ్యాన్స్ అయిపోతుంటారు.
అతడి కెరీర్ ను చూస్తే.. ఒలింపిక్ స్వర్ణ పతకం.. రెండు వింబుల్డన్ లు.. ఆరుసార్లు గ్రాండ్ స్లామ్ విజేతగా నిలవటమే కాదు బోలెడన్ని టైటిళ్లను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం 54 ఏళ్లున్న ఈ జర్మనీ ఆటగాడు కొన్నేళ్లుగా లండన్ లో నివిస్తున్నారు. 2017లో దివాలా చట్టం కింద నాలుగు అభియోగాలు అతనిపై నమోదయ్యాయి. తాజాగా ఈ కేసులకు సంబంధించి బోరిస్ బెకర్ కు లండన్ కోర్టు రెండున్నరేళ్ల జైలుశిక్షను విధించారు. ఇంతకూ అతను చేసిన అంత పెద్ద నేరం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. నమ్మి అప్పు ఇచ్చిన వ్యక్తినే కాదు.. రుణం ఇచ్చిన బ్యాంకులను ముంచేయటం.. దివాలా తీసినట్లుగా ప్రకటించి..తన బ్యాంకు ఖాతాల నుంచి తన మాజీ భార్యల ఖాతాలకు పెద్ద ఎత్తున నగదును తరలించటం లాంటి ఆరోపణల్ని ఎదుర్కొన్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తనకున్న ఆస్తుల్లో జర్మనీలో ఉన్న ఆస్తుల్ని దాచి పెట్టటం.. రూ.67 కోట్ల బ్యాంకు రుణాలతో పాటు.. టెక్ సంస్థలో తనకున్న షేర్ల వివరాల్ని వెల్లడించలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. 2013లో బ్యాంకు నుంచి దాదాపు రూ.39 కోట్లు.. బ్రిటన్ వ్యాపారవేత్త నుంచి రూ.12.24 కోట్లు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించలేదు. దీంతో2017లో బెకర్ ను దివాలాదారుగా ప్రకటించారు.
తన కెరీర్ లో సంపాదించిన రూ.382 కోట్లలో అత్యధికం భార్యకు విడాకులు ఇచ్చే సమయంలో భరణంగా చెల్లించాల్సి వచ్చింది. 1985లో కేవలం 17ఏళ్ల వయసులో వింబుల్డన్ గెలిచిన తొలి అన్ సీడెడ్ ఆటగాడిగా చరిత్రను క్రియేట్ చేశారు. ఆ తర్వాత కొంతకాలానికే అతను తిరుగులేని స్టార్ గా అవతరించారు.
2002లో పన్ను ఎగవేత కేసులో రెండేళ్ల జైలుశిక్షకు గురైనా.. తర్వాత అప్పీల్ లో దాన్ని కొట్టేశారు. తాజాగా ఇప్పుడు చేసిన అప్పును తిరిగి చెల్లించని నేరంలో అతడ్ని దోషిగా తేలుస్తూ రెండున్నరేళ్లు జైలుశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎంతటి వారలైనా.. తప్పు చేస్తే కాలం చేతికి ఏదో రోజు చిక్కాల్సిందే. బోరిస్ జీవితం చెప్పేదిదే.