జయలలిత డబ్బులు.. ఆమె మేనల్లుడు, మేనకోడలుకే..

Update: 2020-10-21 17:33 GMT
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బతుకున్న సమయంలో ఎవరినీ దగ్గరకు రానీయలేదు. తన బంధువులను దూరం పెట్టారు. తన నెచ్చలి, స్నేహితురాలు అయిన శశికళే ఇంట్లో పెట్టుకొని ఆమెనే అంతా నమ్మారు. అయితే జయలలిత మరణం తర్వాత ఆమెకున్న భారీ ఆస్తులు ఎవరనే వివాదం తీవ్రమైంది.

జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆమె మేనకోడలు అంటూ దీప ఆస్పత్రికి వచ్చింది. అయితే ఎవరూ ఆమెను నమ్మలేదు. జయ మరణం తర్వాత ఆమె ఆస్తుల కోసం మేనకోడలు దీప, మేన అల్లుడు దీప్ అంటూ కొంత మంది తెరమీదకు వచ్చారు. తమిళనాడు ప్రభుత్వంతో కోర్టులో పోరాడారు.

జయలలిత బతుకున్నప్పుడు అసలు ఈ దీప, దీపక్ అనేవారే లేరు. కానీ వీరు ఆమె మేనకోడలు, మేనల్లుడిగా నిరూపించుకున్నారు. దీంతో ఈ దూరపు బంధువులకే అమ్మ జయలలిత కూడబెట్టిన కోట్ల ఆస్తి పరమైంది.

జయలలిత ఎవరినైతే దూరం పెట్టారో ఇప్పుడు వారికే ఆస్తి దక్కింది. ఇటీవలే జయలలితకు సంబంధించిన వైట్ మనీ ఆస్తులకు దీప, దీపక్ లను వారసులుగా మద్రాస్ హైకోర్టు ప్రకటించింది. తాజాగా జయలలిత నివాసం వేద నిలయానికి సంబంధించిన డబ్బులను కూడా దీప, దీపక్ లు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

జయలలిత ఇంటిని మ్యూజియంగా తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించి ఆ ఇంటిని కొనుగోలు చేసింది. అందుకు సంబంధించిన డబ్బును కోర్టులో జమ చేసింది. తాజాగా ఆ డబ్బులు ఐటీ కటింగ్స్ పోనూ దీప, దీపక్ లకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో మరోసారి అదృష్టం వీరిద్దరినీ వరించింది.
Tags:    

Similar News