పోలీస్ స్టేషన్ లోనే పోలీస్ ను చితక్కొట్టిన వ్యక్తి.. వైరల్ వీడియో

Update: 2022-07-05 15:44 GMT
ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురిలో ఓ వ్యక్తి పోలీసులపై ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే దాడి చేయడం పెను సంచలనమైంది. ఇతడి వీరంగం చూసి అందరూ నోరెళ్లబెట్టిన పరిస్థితి నెలకొంది. ఏకంగా పోలీసులను చితకబాదిన వైనం విస్తుగొలుపుతోంది. తనను విచారించడానికి పిలిచిన పోలీసుపై సదురు వ్యక్తి దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గృహ హింస కేసుకు సంబంధించి పోలీసులు కౌన్సెలింగ్ కు పిలిచిన ఓ వ్యక్తి.. ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో ఒక పోలీసుపై దాడికి పాల్పడ్డాడు. సదురు వ్యక్తిపై అందిన గృహ హింస ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని పిలిచి కౌన్సిలింగ్ పిలిచి నిర్వహిస్తున్నారు. పోలీసుల కౌన్సిలింగ్ తో విసిగిపోయిన ఆ వ్యక్తి ఏకంగా పోలీసుపైనే దాడికి పాల్పడ్డాడు. అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అతడిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ అతడు పోలీసుపై దాడి చేశాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఎర్రచొక్కా ధరించిన వ్యక్తి తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక పోలీసుతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి తన నిగ్రహాన్ని కోల్పోయి పోలీసులపై అక్కడే ఉన్న ప్లాస్టిక్ కుర్చీతో దాడి చేయడం ప్రారంభించాడు. ఆపకుండా పోలీసును చావగొట్టాడు. ఇక అక్కడే ఉన్న పోలీసులు దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సదురు వ్యక్తిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కుర్చీ అడ్డుపెట్టి కొట్టకుండా ఆపే ప్రయత్నం చేసింది.  

ఈ ఘటనపై మొయిన్ పురి ఏఎస్పీ మధువన్ కుమార్ మీడియాకు వివరించారు. గృహహింస ఫిర్యాదుపై వచ్చిన వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. అందుకే దీనిపై విచారణ జరుపుతున్నామని.. ఇందుకు సంబంధించిన మెడికల్ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తే మేం దాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.

పోలీసులపై దాడి చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు మెయిన్ పురి పోలీసులు వెల్లడించారు. పట్టరాణి కోపంతో పోలీసుపై దాడికి పాల్పడిన వ్యక్తి చివరకు కటకటాల పాలయ్యాడు.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదేనా యూపీ పోలీసుల పరిస్థితి? యూపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. యూపీ పోలీసులను ఎవరైనా కొడుతారు.. కానీ మరో పోలీసు కూడా అతడికి సహాయం చేయలేదని.. ఇలాంటి ఘటనలు చూసి జిహాదీ గుండాలు భయపడుతారా? అని కామెంట్లు చేస్తున్నారు.


Full ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News