చైనీస్ ఈ-కామర్స్ ప్లాట్ ఫారమ్ పిండుయోడువో ఇంక్ వ్యవస్థాపకుడు కోలిన్ హువాంగ్ ఈ సంవత్సరం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ సంపదను కోల్పోయిన వ్యక్తిగా నిలిచాడు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం హువాంగ్ సంపద 27 బిలియన్ డాలర్లకు (19,85,72,31,00,000 రూపాయలు) పైగా పడిపోయింది. చైనా తన దేశంలోని ఇంటర్నెట్ దిగ్గజాలపై విరుచుకుపడడంతో కంపెనీ స్టాక్ ఇంత భారీగా పడిపోయింది. చైనా లోని టెక్ కంపెనీలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆంక్షల పేరిట కంపెనీలపై విరుచుకుపడుతోంది.
ఆయా రంగాల్లో ప్రపంచంలోనే మేటి కంపెనీలుగా కొనసాగిన పలు సంస్థల ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. దీంతో పలు కంపెనీల విలువ ఒక్కసారిగా పడిపోయింది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..ఈ ఏడాది అత్యధిక సంపద కోల్పోయిన వారిలో ఈ-కామర్స్ వేదిక పిండోడో వ్యవస్థాపకుడు కోలిన్ హువాంగ్ ముందున్నారు. హువాంగ్ 27 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.98 లక్షల కోట్లు) సంపదను కోల్పోయారు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ జాబితాలో ఉన్న 500 మందిలో అత్యధిక సంపదను కోల్పోయింది హువాంకేనే. స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు సైతం భారీగా పడిపోయాయి.
పెద్ద కంపెనీలైన అలీబాబా, టెన్సెంట్ కంటే కూడా పీడీడీ అధికంగా నష్టపోయింది. అలీబాబా అమెరికా డిపాజిటరీ రిసీట్‌లు 33 శాతం తగ్గగా, పీడీడీవి 44 శాతం తగ్గడం గమనార్హం. డిసెంబరులో పీడీడీ ఆన్ లైన్ యూజర్ల సంఖ్య 78.8 కోట్లకు చేరింది. పీడీడీ మార్కెట్ విలువ 178 బిలియన్ డాలర్ల నుంచి 125 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం 35 బిలియన్ డాలర్ల వాటా కలిగిన హువాంగ్ గత ఏడాది సీఈఓగా తప్పుకున్నారు. ఈ మార్చిలో ఛైర్మన్ బాధ్యతలను కూడా వదులుకున్నారు. చైనాలో ఉన్న ఆర్థిక అసమానతల తగ్గింపునకు కృషి చేయాలన్న అధ్యక్షుడు షీ జిన్ పింగ్ పిలుపు మేరకు అక్కడి టెక్ కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. వచ్చే లాభాలను దాతృత్వ కార్యక్రమాలను వినియోగిస్తామని హామీ ఇస్తున్నాయి.
ఈ క్రమంలో 1.5 బిలియన్ డాలర్లను దేశంలో వ్యవసాయాభివృద్ధికి వెచ్చిస్తామని పీడీడీ గత నెల ప్రకటించింది. అలాగే 2.4 బిలియన్ డాలర్లు విలువ చేసే సేవలను ఆ కంపెనీ వ్యవస్థాప సభ్యులు ఓ ట్రస్టుకు కట్టబెట్టారు. బ్లూమ్ బెర్గ్ ఇండెక్స్ ప్రకారం..ఈ ఏడాది అత్యధిక సంపదను కోల్పోయిన తొలి పది మందిలో ఆరుగురు చైనాకు చెందినవారే. బాటిల్డ్ వాటర్ కంపెనీ నోంగ్ ఫూ స్ప్రింగ్ ఛైర్మన్ ఝోంగ్ శాన్‌శన్ 18 బి.డా, ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వ్యవస్థాపకుడు ఎవర్ గ్రాండే 10 బి.డా, టెక్ సంస్థ టెన్సెంట్ అధిపతి పోనీ మా 10 బి.డా, అలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్ మా 6.9 బి.డా కోల్పోయారు.
హువాంగ్ 2015లో పిండుయోడువో కంపెనీలో 28 శాతం వాటా కలిగి ఉన్నాడు. కమ్యూనిటీ కొనుగోలుకు మార్గదర్శకత్వం వహించడం ద్వారా పిండుయోడువోని అనతి కాలంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజంగా మలిచాడు. పీడీడీ వార్షిక క్రియాశీల వినియోగదారులు డిసెంబరులో 788 మిలియన్లకు చేరుకున్నారు. ఇది ఆలీబాబా ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ లలో 779 మిలియన్లను అధిగమించింది. కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 125 బిలియన్ డాలర్లకు పడిపోయే ముందు గరిష్టంగా 178 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది గత నెలలో పబ్లిక్ కంపెనీగా మొదటి త్రైమాసిక నికర లాభాన్ని నివేదించింది. హువాంగ్, గత ఏడాది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తన పదవికి రాజీనామా చేశారు. అలానే మార్చిలో మార్చిలో చైర్మన్ పదవి నుంచి వైదొలగారు.