బజాజ్ చేతక్ బండి ప్రస్తుతం ఎక్కడా కనిపించలేదు. కాని ఒకప్పుడు ఆ బండిదే హవా. టీవీల్లో యాడ్ కూడా వచ్చేది. ఓ ఫ్యామిలీ బండిగా బజాజ్ చేతక్ బాగానే ప్రాచుర్యం పొందింది. అప్పట్లో ఆ బండి ఉంటే అదో గొప్ప. అలాంటి ఓ పాత బండిన ఓ మంత్రి కొనాలని అనుకున్నారు. దాన్ని చూడగానే ఆ మంత్రికి గత స్మృతులు గుర్తుకొచ్చాయి. చదువుకొనే రోజులు, ఇంటింటికీ తిరిగి పాలు అమ్మిన రోజులు కళ్లముందు కదలాడాయి.
ఆనాటి స్కూటర్ ఎక్కి అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు మంత్రి మల్లారెడ్డి.ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్నా.. ఆనాటి చేతక్ బండిని చూడగానే అప్పటి రోజుల్లోకి వెళ్లిపోయారు. స్కూటర్‌పై చక్కర్లు కొట్టారు. మంత్రి మల్లారెడ్డి బోయిన్ పల్లిలోని తన నివాసం వద్ద 30 ఏళ్ల నాటి బజాజ్ బండిపై తిరిగి గత అనుభూతి పొందారు. అప్పట్లో మల్లారెడ్డి తన చేతక్ ను ప్రభుగౌడ్ అనే వ్యక్తికి అమ్మేశారు. అతను మరో వ్యాపారికి అమ్మగా.. ఆ స్కూటర్ ఇప్పుడు మల్లారెడ్డికి కనిపించింది. ఎంతో కలిసొచ్చిన ఆ స్కూటర్ ను తిరిగి తనకే విక్రయించాలని మంత్రి కోరగా.. ఆ యజమాని అందుకు నిరాకరించాడు. ఆ చేతక్ తో తనకు కూడా ఎంతో కలిసి వచ్చిందని చెప్పాడు. ఆ స్కూటర్ కొన్న తర్వాతే తనకు వ్యాపారంలోకలిసి వచ్చిందని.. తాను ఆ స్కూటర్ అమ్మలేనని చెప్పారు. మొత్తానికి మంత్రి కోరుకున్నట్లుగా స్కూటర్ సొంతం కాకున్నా.. పాత గురుతుల్లోకి వెళ్లి కాసేపు హాయిగా చక్కర్లు కొట్టారు.