సొంత బీజేపీ ప్రభుత్వంపైన సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే

Update: 2022-07-15 02:30 GMT
బీజేపీ ఇరుకునపడేలా సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించాడు. మధ్యప్రదేశ్ సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బీజేపీకి ఇది ఊహించని షాక్ లా మారింది. బీజేపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని పార్టీ స్వలాభం కోసం వాడుకుంటున్నారని.. దీన్ని సహించలేకపోతున్నామంటూ బహిరంగ వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం అధికారులను పార్టీ కోసం వాడుకొని అధికారంలోకి వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంతో అధికార పార్టీకి షాక్ తగిలింది. ప్రతిపక్ష బీజేపీ దీన్ని అందిపుచ్చుకొని చెలరేగిపోయింది.

మధ్యప్రదేశ్ లోని మైహర్ (సత్నా) నియోజకవర్గ ఎమ్మెల్యే నారాయణన్ త్రిపాఠి తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ‘ఈ ప్రాంతంలోని పట్వారీ నుంచి టాప్ ర్యాంక్ ఆఫీసర్ దాకా అంతా పార్టీ కోసమే పనిచేస్తున్నారని.. బీజేపీ ఓట్ల కోసమే తాపత్రయపడుతోందని ఆరోపించారు. నేనూ బీజేపీ ఎమ్మెల్యేనని.. కానీ ఇలాంటి పరిస్థితి చూసి ఆవేదన చెందుతున్నానని వాపోయారు.

ఈ దేశంలో ఒక ప్రభుత్వాన్ని రెండు నిమిషాల్లో పడగొడుతున్న నేపథ్యంలో చివరకు స్తానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభుత్వం ఇలాంటి రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితి మారాలని పిలుపునిచ్చాడు.

ఎమ్మెల్యే నారాయణన్ త్రిపాఠి చేసిన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ  బీజేపీలో కనీసం ఒక్కరైనా నిజాలు చెబుతున్నారని.. ధైర్యం చేస్తున్నారని.. నారాయణన్ కు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు బీజేపీతో కలిసి ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారంటూ దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.

మైహర్ నియోజకవర్గం నుంచి 2003లో త్రిపాఠి తొలిసారి సమాజ్ వాదీ పార్టీ నుంచి పోటీచేశాడు. 2013లో కాంగ్రెస్ నుంచి గెలిచాడు. 2016 ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2018లో మరోసారి బీజపీ టికెట్ మీదే గెలిచాడు.  2019లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటేసి దుమారం రేపాడు. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. 
Tags:    

Similar News