అందరిముందే ప్రిన్సిపాల్ చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే..: కారణం ఇదే లేదా
ఒక వ్యక్తి ఎంత పెద్ద ప్రయోజకుడైనా ఆ క్రెడిట్ అంతా చదువు నేర్పిన గురువుకు కూడా వెళ్తుంది. తన జీవితం సక్రమంగా సాగడానికి తన గురువు నేర్పిన పాఠాలేనని చాలా మంది పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అలాంటి ఓ కళాశాల ప్రిన్సిపాల్ ను ఓ ప్రజాప్రతిని బహిరంగంగా చేయి చేసుకున్నాడు. కళాశాలలో పనుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంప చెల్లుమనిపించాడు.
పనుల తీరుపై చర్యలు తీసుకోవాలని గానీ.. ఇలా పబ్లిక్ లో ప్రిన్సిపాల్ పై చేయి చేసుకున్న తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సదరు ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్ గా మారుతోంది.
కర్ణాటకలోని జనాదత్ ఎమ్మెల్యే శ్రీనివాస్ జూన్ 20న కళాశాల తనిఖీలకు వెళ్లారు. ఇందులో భాగంగా మాండ్యాలోని నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కళాళాశాలకు వచ్చారు. ఈ కళాశాలలో జరుగుతున్న కంప్యూటర్ ల్యాబ్ పనులపై ఆరా తీశారు. అయితే ఈ పనుల గురించి ఆ కళాశాల ప్రిన్సిపాల్ ను అడిగారు.
దీంతో ఆ ప్రిన్సిపాల్ పొంతనలేని సమాధానం ఇచ్చారు. దీంతో ఆయన సమాధానానికి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ప్రిన్సిపాల్ చెంపపై నాలుగైదు సార్లు కొట్టారు. ఎమ్మెల్యే చుట్టూ మనుషులు, కళాశాల సిబ్బంది ముందే ప్రిన్సిపాల్ చెంప చెల్లుమనిపించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యేపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్తామని అంటున్నాయి. కళాశాల పనుల్లో లోపం ఉంటే చర్యలు తీసుకోవాలి గానీ.. ఇలా అందరి ముందు అవమానించడం భావ్యం కాదని అంటున్నారు. అంతేకాకుండా ఒక కళాశాల ప్రిన్సిపాల్ ను ఇలా బహిరంగంగా చెంపపై కొడితే తన స్టూడెంట్ ముందు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.
ఈ వీడియోపై రకరకాల స్పందనలు వస్తున్నాయి. కానీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన తరువాత ఎలాంటి చర్యలు ఉంటాయోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Full View