ఎంపీ ని సజీవ దహనం చేస్తానంటున్న ఎమ్మెల్యే !

Update: 2019-11-29 07:05 GMT
రాజకీయ నేతలు అప్పుడప్పుడు కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొంతమంది తమ ఉనికి చాటుకోవడానికి కూడా ఇటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తారు. రాజకీయాల్లో ఇటువంటి ఘటనలు మాములే అయినప్పటికీ .. ఆలా మాట్లాడే వారి మాటలని వారి పార్టీ నేతలు కూడా విభేదిస్తేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ , రాజకీయాలలో ఫైర్ బ్రాండ్స్ గా కొనసాగేవారు ఇలాంటి విషయాలని పెద్దగా పట్టించుకోరు..ఎవరు ఏమనుకున్నా కూడా పర్వాలేదు అంటుకుంటూ అలానే పోతుంటారు. అలాంటివారిలో ఒకరు  బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌.

ఈమె ఎప్పుడు ఎదో ఒక వివాదంలోనే ఉంటుంది. తాజాగా లోక్ సభలో మాట్లాడుతూ ..మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించారు. అయితే ప్రజ్ఞా వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి.  గతంలో కూడా ప్రజ్ఞా.. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే ను దేశభక్తుడిగా చెప్పిన సంగతి తెలిసిందే. అప్పుడు  విపక్షాల నుండి  తీవ్రమైన వ్యతిరేకత రావడం, బీజేపీ సైతం ప్రజ్ఙా వ్యాఖ్యలకు మద్దతుగా నిలవకపోవడంతో ఆమె క్షమాపణ చెప్పారు.

ఇక మరోసారి ఆమె అదే విదంగా మాట్లాడటం తో  మధ్యప్రదేశ్‌  బయోరా కాంగ్రెస్  ఎమ్మెల్యే గోవర్థన్‌ డంగీ  ఆమె పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మధ్యప్రదేశ్‌ లో అడుగుపెడితే సజీవ దహనం చేస్తానని ప్రకటించాడు.  ప్రజ్ఞాసింగ్‌   చేసిన ఈ వివాదస్పదమైన వ్యాఖ్యలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాలు కూడా  ఖండించారు. దీని ఫలితంగా రక్షణ మంత్రిత్వ సలహా కమిటీ నుంచి ప్రజ్ఞాను బీజేపీ తొలగించింది. అలాగే మరోవైపు  ఎంపీ సాధ్వీ వ్యాఖ్యలకు నిరసనగా ఆమె నియోజకవర్గమైన భోపాల్‌ లో గురువారం నిరసన ప్రదర్శనలు జరిగాయి
Tags:    

Similar News