నిజానికి ఇలాంటివి చోటు పరిస్థితి ఎవరికి రాకూడదనే కోరుకోవాలి. కానీ.. అనూహ్యంగా జరిగే ఉదంతాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి చట్టబద్ధంగా పోస్టుమార్టం చేయాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో కొందరికి ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో పోస్టుమార్టం ప్రొసీజర్.. అందుకు అమల్లో ఉన్న విధివిధానాల గురించి తెలిస్తే నోటి వెంట మాట రాక మానదు. పోస్టుమార్టం చేయాలంటే సదరు వైద్యుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే చేయటం.. రాత్రిళ్లు చేసే ప్రొవిజన్ లేకపోవటం వల్ల.. అంత్యక్రియల కోసం చాలాసేపు ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరణించిన వారి కుటుంబ సభ్యులు అనుమతితో అవయువ దానాన్ని చేపట్టాలంటే అందుకు సహకరించే పరిస్థితులు తాజాగా లేవు.
ప్రస్తుతం అమలవుతున్న విధివిధానాల్ని చూసినప్పుడు కీలకమైన సందర్భాల్లో అవయువ దానాలు చేయాలనుకున్న వారికి అలా చేయలేని పరిస్థితి. బ్రిటీషర్ల కాలంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాత్రిళ్లు పోస్టుమార్టం చేయకూడదన్న నిబంధనను నేటికిఅమలు చేస్తున్న పరిస్థితి. కాలం చెల్లిన ఇలాంటి రూల్స్ ను ఒక్కొక్కటిగా మారుస్తున్న మోడీ సర్కారు.. తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకోవటమే కాదు.. అందరికి ప్రయోజనాన్ని కలిగించే నిర్ణయాన్ని తీసుకున్నారు.
సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త విధానంలో ఆరోగ్యవంతులైన వ్యక్తులు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే.. వారి ఆవయువాల దానం ద్వారా దాదాపు ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ఇచ్చే వీలుంది. అయితే.. పోస్టుమార్టం నిబంధనల్లో ఉన్న పరిమితుల కారణంగా.. టైమ్లీగా పోస్టు మార్టం చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోకేంద్రం.. రాత్రిళ్లు సైతం పోస్టుమార్టం చేసేందుు వీలుగా అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
అవయువ దానం ప్రాధాన్యతగా రాత్రిళ్లు సైతం ఆసుపత్రుల్లో పోస్టుమార్టం నిర్వహణకు ఓకే చెప్పింది. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తాజా నిర్ణయాన్ని అమలు చేసే వేళలో.. భవిష్యత్తులో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పోస్టు మార్టం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేసి పుటేజీని దాచి పెట్టాలని పేర్కొంది.
హత్యలు.. ఆత్మహత్యలు.. అత్యాచారాలు.. బాగా దెబ్బ తిన్న స్థితిలోని అనుమానాస్పద మరణాల కేసుల్లో మాత్రం డెడ్ బాడీలకు పోస్టుమార్టం చేసే వీల్లేదని తేల్చారు. బ్రిటీష్ కాలం నాటి పద్దతికి మంగళం పాడుతూ.. 24 గంటలూ పోస్టుమార్టం చేసేందుకు వీలుగా తీసుకున్న మోడీ సర్కారు నిర్ణయం.. అవయువ దానం చేయాలనుకునే వారికి ఒక మంచి అవకాశంగా మారుతుందని చెప్పాలి.