కరెన్సీకి సంబంధించి ఎప్పుడూ జరగనంత చర్చ మోడీ సర్కారులోనే సాగింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంటూనే.. రద్దు చేసిన నోటుకు డబుల్ విలువ ఉన్న నోటను ప్రవేశం పెట్టిన మోడీ సర్కారు.. ఆ సందర్భంగా ఇచ్చినన్ని షాకులు అన్ని ఇన్ని కావు. మోడీకి సలహాదారుగా వ్యవహరించిన పెద్దాయన ఇటీవల ఒక పుస్తకాన్ని రాస్తూ.. రూ.2వేల నోటును తేవాలన్న ఇంట్రస్టు ప్రధానికి లేదని.. ఆ మాటకు వస్తే.. ఆ పెద్ద నోటకు నో చెప్పారన్నారు.
అయితే.. అప్పటికున్న పరిమితుల కారణంగా రూ.2వేల నోటుకు మోడీ ఓకే చెప్పక తప్పలేదన్నారు. ఇటీవల కాలంలో రూ.2వేల నోట్ల ముద్రణను నిలిపివేసినట్లుగా వార్తలు రావటం.. రానున్న రోజుల్లో ఆ పెద్ద నోటును క్రమపద్దతిలో కనుమరుగు చేసేందుకు వీలుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రూ.2వేల నోటుపై బోలెడంత క్లారిటీ ఇచ్చేశారు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్.
తాజాగా లోక్ సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. రూ.2వేల నోటు మీద వివరంగా సమాధానం ఇచ్చారు. క్రమ పద్దతిలో రూ.2వేల నోటును తొలగించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుందన్న ప్రచారంలో నిజం లేదని కొట్టేశారు. రూ.2వేల నోటు ప్రింటింగ్ ను నిలిపివేయాలన్న అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదన్నారు.
అంతేకాదు.. రూ.2వేల నోటు ప్రింటింగ్ ఆపటం తాత్కాలికమే కానీ పర్మినెంట్ కాదని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగానే కరెన్సీ నోట్ల ముద్రణ నిలిపివేశామని.. ప్రస్తుతానికి దశల వారీగా ముద్రణ ప్రక్రియ షురూ అయినట్లుగా పేర్కొన్నారు. త్వరలోనే కొత్త నోట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చే వీలుంది. రూ.2వేల నోటును ఇంటికి వంపిచేస్తారా? అన్న సందేహాలకు తాజాగా మంత్రివారు ఇచ్చిన సమాధానంతో ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లేనని చెప్పక తప్పదు.