ప్రధాని నరేంద్ర మోడీ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలా.. అయితే.. ఇప్పుడు ఆయనకు సంబంధించి అన్ని విషయాలను వివరించే.. ఒక ప్రత్యేక వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. `మోడీ స్టోరీ డాట్ ఇన్` పేరుతో రూపొందించిన ఈ పోర్టల్‌ను మహాత్మాగాంధీ మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి ప్రారంభించారు. గుజరాత్‌లోని వాద్నగర్లో మోడీ చదువుకు న్న పాఠశాల ప్రిన్సిపల్ రాస్బిహారీ మనియార్, 90వ దశకంలో ఆయనకు ఆశ్రయం కల్పించిన శారదా ప్రజాపతి వంటి వారి నుంచి వివరాలు, అనుభవాలు సేకరించి ఇందులో పొందుపర్చారు.
అవి 1980ల నాటి రోజులు.. మోడీ అప్పుడప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఓ రోజు గుజరాత్‌కు చెందిన డాక్టర్ అనిల్ రావల్ అనే వ్యక్తి మోడీతో కలిసి ప్రయాణం చేశారు. ఆ సమయంలో రాజకీయాల గురించి సంభాషణ రాగా రావల్.. మోడీని ఓ ప్రశ్న అడిగారు. సమాజంలో చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతి కోసం ఎలా కట్టుబడి ఉంటారు..? అని ప్రశ్నించారు. దీనికి మోడీ బదులిస్తూ.. "ఒక సారి నేను ఓ స్వయంసేవక్ ఇంటికి వెళ్లాను. అది ఓ మురికివాడలో ఉంది. ఆ ఇంట్లో స్వయంసేవక్ తన భార్య, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. నేను వెళ్లగానే నాకు పళ్లెంలో సగం రొట్టె, చిన్న గిన్నెలో పాలు తీసుకొచ్చి అందించారు.
తల్లి ఒడిలో కూర్చున్న ఆ చిన్నారి ఆ పాలగిన్నె వైపు ఆకలిగా చూస్తున్నాడు. అప్పుడే నాకు అర్థమైంది ఆ పాలు చిన్నారి కోసం ఉంచినవి అని. నేను ఆ సగం రొట్టెను నీళ్లతో తినేసి పాలు వదిలేశారు. ఆ తర్వాత ఆ తల్లి పాలగిన్నెను చిన్నారికి ఇచ్చింది. ఆ బాబు వాటిని గడగడా తాగేశాడు. అప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే నేను నిర్ణయించుకున్నా. సమాజంలోని చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతి కోసమే నా ఈ జీవితం అంకితం చేయాలని..!" అని చెప్పారు.
ఇలా మోడీతో అనుబంధం, పరిచయం ఉన్న ఎంతోమంది ప్రధానితో తమకున్న అనుభవాలను పంచుకున్నారు. ఆ స్ఫూర్తిదాయక అనుభవాలతో కూడిన ప్రత్యేక పోర్టల్ తాజాగా ప్రారంభమైంది. 'MODI STORY' పేరుతో రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి చేతుల మీదుగా ప్రారంభించారు.
మోడీ గురించి ఎంతోమందికి తెలియని అరుదైన ఘట్టాల సమాహారమే ఈ వెబ్సైట్. గుజరాత్‌లోని వాద్నగర్లో మోడీ చదువుకున్న పాఠశాల ప్రిన్సిపాల్ రాస్ బిహారీ మణియార్, 90వ దశకంలో ఆయనకు ఆశ్రయం కల్పించిన శారదా ప్రజాపతి వంటి వారు.. ఇందులో మోదీతో తమకున్న అనుభవాలను పంచుకున్నారు.
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ కోచ్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ సహా మరికొందరు మోడీతో తమ అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచార సమయంలో మోడీ ఆలోచనలు, విద్యార్ధిగా సైనిక దళాలపై ఆయన అభిప్రాయాలు, దేశ సేవపై ఆసక్తి వంటి వివరాలు ఇందులో ఉన్నాయి.
ఈ వెబ్సైట్ నుంచి బీజేపీ అధికారిక ట్విటర్ ఖాతాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు తమ ట్విటర్ ఖాతాల్లో రాసుకొచ్చారు. మరి మోడీ గురించి తెలుసుకోవాలనుకునేవారు.. ఈ వెబ్సైట్లోకి వెళ్లిపోవడమే!