తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తాన్ని ఆకర్షించిన సంగతి తెలిసిందే. మొత్తం 47 మంది పోటీ చేసిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 6న వెల్లడి కానున్నాయి.
కాగా విజయం సాధించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్, బీజేపీ ఓటర్లకు పెద్ద ఎత్తున మద్యం, నగదు పంపిణీ చేశాయి. అంతేకాకుండా తులం బంగారాన్ని కూడా బీజేపీ ప్రతి కుటుంబానికి అందించిందని వార్తలు వచ్చాయి.
మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే ఓటర్లకు మద్యం, మాంసం నిత్యం ఆయా పార్టీలు పంపిణీ చేశాయని చెబుతున్నారు. ఒక్క మునుగోడు ఉప ఎన్నిక కోసమే దాదాపు రూ.450 కోట్లు ఖర్చు చేశారని అంటున్నారు.
ఇక మద్యం విషయానికొస్తే అక్టోబర్ నెలలో తెలంగాణ మొత్తం మీద రూ.3007 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో ఒక్క మునుగోడు వాటానే పది శాతం ఉందని అంటున్నారు. ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే రూ.300 కోట్ల మద్యం విక్రయించారని చెబుతున్నారు.
ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి నియోజకవర్గంలో గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో మద్యం, మాంసం విక్రయాలు జరిగాయి. తాజా నివేదికల ప్రకారం, అక్టోబర్ నెలలో తెలంగాణ మొత్తం రూ. 3007 కోట్ల మద్యం విక్రయాలను నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన విక్రయాల్లో ఒక్క మునుగోడు నియోజకవర్గం 10% వాటాను కలిగి ఉంది. కాగా నవంబర్ 6వ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియతో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తేలనుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్వాయి స్రవంతి, టీఆర్‌ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటీ చేశారు.
ఇప్పటికే వెలువడ్డ ఎగ్జిట్‌పోల్స్‌లో ఎక్కువ భాగం టీఆర్‌ఎస్ గెలుపొందుతుందని అంచనా వేశాయి. మరోవైపు 93 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడంతో టీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థి విజయంపై ఆశలు పెట్టుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.