ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో వరుస హత్యల మిస్టరీ వీడింది. ఎట్టకేలకు సీరియల్ సైకో కిల్లర్ రాంబాబును విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. వరుస అత్యాచారాలు, హత్యలతో విశాఖ వాసులు ఆందోళన చెందిన సంగతి తెలిసిందే. కుటుంబం దూరం కావడం, పలువురి చేతిలో మోసపోవడంతో మతిస్థిమితం కోల్పోయి రాంబాబు సైకో కిల్లర్‌గా మారినట్టు విశాఖ పోలీసు కమిషనర్ తెలిపారు.
పోలీసు కమిషనర్ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా కోటవురట్ల పరిధిలోని ధర్మ సాగరం గ్రామానికి చెందిన చందక రాంబాబు (49) విశాఖ నగరంలో జీవిస్తుండేవాడు. 18 ఏళ్ల వయసులో రాజమండ్రికి చెందిన యువతితో రాంబాబుకు పెళ్లి అయ్యింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించారు. తాపీ మేస్త్రీగా, ఆటో రిక్షా డ్రైవర్‌గా పనిచేసిన రాంబాబు హైదరాబాద్‌లో కొన్నాళ్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా కూడా పనిచేశాడు.
హైదరాబాద్‌లో తాము అద్దెకు ఉంటున్న ఇంటి యజమానితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో 2018లో ఆమెతో రాంబాబు విడిపోయాడు. దీంతో బిడ్డలను తండ్రి దగ్గరకు వెళ్లనీయకుండా అతడి భార్య అడ్డుకుంది. మరోవైపు రాంబాబు పనిచేసే రియల్ ఎస్టేట్ సంస్థ అతడిని మోసం చేసింది.
దీంతో 2021 అక్టోబరులో విశాఖ జిల్లా పెందుర్తికి వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే క్షుద్రపూజలు చేస్తున్నాడని ఇంటి యజమాని రాంబాబుతో ఇళ్లు ఖాళీ చేయించాడు. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడం, బిడ్డలను తన దగ్గరకు రానీయకపోవడం, రియల్ ఎస్టేట్ సంస్థ మోసం చేయడం వంటి కారణాలతో అతడు మహిళలపై ద్వేషం పెంచుకున్నాడు. గత కొంత కాలంగా నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని సమాచారం.
ఈ క్రమంలో ఒంటరిగా మహిళలు కనిపిస్తే వారిని చంపేసేవాడు. ఆ తర్వాత మృతదేహాలను అత్యాచారం చేసేవాడు. గత వారం వృద్ధ దంపతులను హత్య చేశాడు. అనంతరం నిర్మాణంలో ఉన్న భవనాలకు కాపలాగా పనిచేస్తున్న మూడు కుటుంబాలను అంతమొందించాడు. ఇనుప రాడ్డుతో తలపై కొట్టి హత్యలు చేసేవాడు. అనంతరం మరణించిన మహిళలపై అత్యాచారం చేసేవాడు.
నిందితుడు రాంబాబు ఆలయాలు, ఫంక్షన్ హాళ్లలో తింటూ హత్యలకు పాల్పడ్డాడు. అతడి వద్ద సెల్‌ఫోన్ కూడా లేకపోవడంతో పట్టుకోలేకపోయారు. ఆగస్టు 15న రాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న సైకో సీరియల్ కిల్లర్ రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు.