క‌న్న‌డ నేత‌ల కామ‌పురాణం.. ఒక్క‌రా ఇద్ద‌రా.. తొవ్వుతుంటే దొరుకున్‌!

Update: 2021-03-04 14:30 GMT
శృంగారం.. సంసార ప‌క్షం అయినంత వ‌ర‌కూ ఎవ‌రికీ ఇబ్బంది లేదు. వ్య‌భిచార రొంపిగా మారిన‌ప్పుడే అబ్జ‌క్ష‌న్‌. అందులోనూ ప్ర‌జాప్ర‌తినిధులు నిందితులుగా, దోషులుగా ఉన్న‌ప్పుడు అభ్యంత‌రం మ‌రింత తీవ్ర‌మ‌వుతుంది. తాజాగా క‌ర్నాట‌క జ‌ల‌వ‌న‌రుల మంత్రి హోదాలో ర‌మేష్ జార్కి జ‌రిపిన కామ‌కేళి దేశ‌వ్యాప్తంగా ఏ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశ‌మైందో అంద‌రికీ తెలిసిందే. చివ‌ర‌కు అది ఆయ‌న‌ మంత్రి ప‌ద‌వి ఊడిపోవ‌డానికి కూడా కార‌ణ‌మైంది. అయితే.. ఇది లేటెస్ట్ ఎపిసోడ్ కాబ‌ట్టి ర‌మేష్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యాడుగానీ.. ఆయ‌న సీనియ‌ర్లు చాలామందే ఉన్నారు! స‌మ‌యం చూసుకొని సందులో దూరినా.. టైం బాగ‌లేక అడ్డంగా బుక్కైన క‌న్న‌డ నేత‌లు ఎంద‌రో ఉన్నారు. వారి ఎపిసోడ్లు టెలికాస్ట్ చేస్తే సీరియ‌ల్ అవ్వుద్ది.. తీస్తే సినిమా అయిపోద్ది!

ఓ ముఖ్య‌మంత్రి..
ఈ సెక్స్ బాగోతంలోని పాత్ర‌ల‌ పేర్లు ఎందుకులేగానీ.. హోదాలు చెప్పేస్తాం. వాళ్ల సినిమా ఏరేంజ్ లో ఆడిందో చూసుకోండి. అప్ప‌ట్లో పెద్ద త‌ల‌కాయ ఉండేది. అదీ ఇదీ కాదు.. ఏకంగా ముఖ్య‌మంత్రి! ముసుగులో గుద్దులాట‌లు ఎందుకు అనుకున్నాడో ఏమోగానీ.. డైరెక్టుగా చెప్పేశాడు. రాత్రి అయితే గ్లాసులో తాగే సుక్క ఉండాలి.. బెడ్ మీద ప‌డుకునే చుక్క ఉండాల‌ని నేరుగానే అనేశాడు. అవి రెండూ త‌న బ‌ల‌హీన‌త‌లు అని క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ.. ఇండియాలో దాన్ని లైట్ తీసుకునే కాలం ఇంకా రాలేదు. అందుకే.. రాష్ట్రంలో ఈ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం కాగా.. పొలిటిక‌ల్ పెద్ద వార్ న‌డిచింది.

ఓ ఎంపీ...
ఈయ‌న ఓ న‌ర్సుపై క‌న్నేశాడు. త‌న కోరిక తీర్చ‌క‌పోతే అంతు చూస్తాన‌ని బెదిరించాడ‌ట‌. అయిన‌ప్ప‌టికీ బాధితురాలు త‌ల‌వంచ‌లేదు.. అదే స‌మ‌యంలో ఈ కామాంధుడి బాధ‌లు త‌ట్టుకోలేక‌పోయింది. రాష్ట్ర మాన‌వ‌హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో.. ఈ వ్య‌వ‌హారం చినికి చినికి గాలివాన‌గా మార‌డంతో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాడు.

ఓ మంత్రి...
మ‌రో మంత్రి కూడా ఇదే వ్య‌వ‌హారంలో అడ్డంగా బుక్క‌య్యాడు. ర‌సికుడిగా పేరున్న స‌ద‌రు మంత్రి.. ఏకంగా త‌న స్నేహితుడి భార్య‌పైనే అత్యాచారానికి య‌త్నించాడ‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నాడు. 2009 లో ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా సాగింది. రాజ‌కీయంగా తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో త‌న ప‌ద‌విని ఊడ‌గొట్టుకున్నాడు ఈ నేత‌.

ముగ్గురు ఎమ్మెల్యేలు..
ఇక 2012లో ముగ్గురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేసిన వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వారికి ఎక్క‌డా టైం దొర‌క‌లేదో.. లేదంటే, అసెంబ్లీలో బోరు కొట్టిందోగానీ.. ఫోన్‌లో సెక్స్ వీడియోలు చూస్తూ దొరికిపోయార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా పెను దుమారం రేపింది. ఈ వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు జ‌రిపిన అప్ప‌టి హోంశాఖ‌.. వారి త‌ప్పేమీ లేదంటూ రిపోర్టు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఈ ఎమ్మెల్యేల్లో ఒక‌రు ప్ర‌స్తుత యెడ్డీ క్యాబినెట్లో మంత్రి కూడా..

మ‌రో మంత్రి..
2016లో మ‌రో మంత్రి కూడా సెక్స్ వీడియోల వ్య‌వ‌హారం గుట్టు ర‌ట్టు కావ‌డంతో ప‌ద‌వి పోగొట్టుకున్నాడు. ఆయ‌న‌ కామ‌కేళిని వీడియో రూపంలో ప్ర‌పంచం మొత్తం చూసేసింది. దీంతో.. త‌ల వంచుకొని స‌చివాల‌యం నుంచి వెళ్లిపోవాల్సి వ‌చ్చింది.

ఇలా.. ఒక్క‌రా? ఇద్ద‌రా? ఎంతో మంది అధికారం ఉంద‌నే అహంకారంతో ఆడ‌వాళ్ల‌ను లోబ‌రుచుకున్న‌వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే.. దొరికిన వాడే దొంగ అన్న‌ట్టుగా.. బ‌య‌టికి రాని ఉదంతాలు కూడా చాలానే ఉన్నాయ‌నేది ప్ర‌జ‌లు చెబుతున్న‌మాట‌. ఏదిఏమైనా.. ప్ర‌జాప్ర‌తినిధులుగా ఉండి, ప్ర‌జ‌ల‌కు మంచి మార్గం చూపించాల్సిన వారు, ఆద‌ర్శంగా ఉండాల్సిన వారు ఇలాంటి చ‌ర్య‌ల‌తో బ‌జారున ప‌డ‌డం క్ష‌మించ‌రానిది.
Tags:    

Similar News