ఆ పత్రిక ఆరోపించిన 30 కోట్ల డీల్ లో ఉన్నది వారట..

Update: 2021-03-03 06:33 GMT
ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా.. ఇప్పుడు సదురు చానెల్ తో పెట్టుకున్న పాపానికి ఓ ముఖ్య నేత దాడికి గురికావడమే కాదు.. ఇప్పుడు ఆ పత్రిక వద్దనున్న ఒక ముఖ్యమైన సీక్రెట్ డీల్ లోనూ బలిపశువు అయ్యారన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.

ఇటీవలే తెలుగు నాట ప్రముఖ పత్రిక ఓ బాంబు పేల్చింది. రాయలసీమలోని ఓ ఆశ్రమంలో అక్రమాలపై కేంద్రంలోని నిఘా సంస్థలు నిగ్గుతేల్చాయని.. దాడి చేయబోతున్నాయని తెలిసి ఆశ్రమ నిర్వాహకులు ఏపీలోని ప్రముఖవ్యక్తులైన ఇద్దరు   నేతలను సంప్రదించినట్టు పత్రిక రాసుకొచ్చింది.  ప్రభుత్వంలో కీలకంగా ఉన్న  నేత.. ఏపీ మరో నేతతో కలిసి 30 కోట్లకు డీల్ మాట్లాడుకొని ఓ నిఘా వర్గాల అధికారిని పిలిపించి ఆశ్రమనిర్వాహకులతో సెటిల్ చేసుకున్నాయని సదురు పత్రిక రాసుకొచ్చింది.

అయితే ఆ   ముఖ్య నేత ఎవరు? ఆయనకు సహకరించిన ఏపీ నేత ఎవరన్నది మాత్రం   పత్రిక బయటపెట్టలేదు. ఇది ఏపీలో పెను దుమారం రేపడంతో సీపీఐ నేత రామకృష్ణ తాజాగా దీనిపై స్పందించారు. ఓ ఇద్దరు ముఖ్య నేతల పేర్లను ప్రెస్ మీట్ లో చెప్పేశారు. ఇదే ఇప్పుడు కలకలమైంది.

సీపీఐ రామకృష్ణ చెప్పిన పేర్లు ఇటీవల వార్తల్లో నిలిచిన ఓ ముఖ్య నేతతోపాటు కేంద్రంలో ఏపీ తరుఫున చక్రంతిప్పే నేత కావడం సంచలనమైంది.

అయితే సీపీఐ రామకృష్ణ ఆరోపించిన వ్యక్తులు.. సదురు పత్రిక రాసిన రాతల్లోని వ్యక్తులు ఒకటేనా కాదా అన్నది ఎవరికి తెలియదు.దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. . ఎందుకంటే రాసిన పత్రిక బయటపెట్టలేదు. సీపీఐ రామకృష్ణ ఆరోపణలు నిజమోకాదో తెలియదు.. సో ఇప్పటిదాకా దీనిపై అందరూ గప్ చుప్ గానే ఉన్నారు. సోషల్ మీడియాలోనూ చర్చించుకుంటున్నారు.. అధికారికంగా ప్రకటించే వరకు ఇదో గాలివార్తగానే భావించాల్సి ఉంటుంది.
Tags:    

Similar News