ప్రపంచ అత్యంత ధనవంతుల్లో నంబర్ 1గా నిలిచే అమెజాన్ అధినేత జెఫ్ బిజోస్ ను కొత్త కుబేరుడు వెనక్కి నెట్టారు. లగ్జరీ గూడ్స్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ ప్రపంచ కుబేరుల్లో తొలి స్థానంలో నిలిచింది. ఫలితంగా రెండో స్థానానికి బిజోస్ పడిపోయారు. రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఆర్నాల్డ్ తొలి స్థానం సంపాదించుకున్నారు.
ఆర్నాల్ట్, అతని కుటుంబ మొత్తం ఆస్తుల నికర విలువ 186.4బిలియన్ డాలర్లు. అనగా రూ.13,57,737 కోట్లు పైమాటే. ఆ సంస్థ స్టాక్స్ విలువ 765 మిలియన్ డాలర్ల మేర పెరగడం వల్లే తొలి స్థానంలోకి ఎగబాకింది. అందుకే సులభంగా బిజోస్ ను వెనక్కి నెట్టగలిగారు. కొద్ది రోజులుగా వీరి బ్రాండ్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ పెరిగి ఆర్నాల్ట్, ఆయన కుటుంబ ఆస్తులు వృద్ధి చెందాయి.
ఆర్నాల్ట్, ఆయన ఫ్యామిలీకి చెందిన కంపెనీ లూయిస్ విటన్ మోట్ హోనెస్సీ. ఈ బ్రాండ్ తో లగ్జరీ గూడ్స్ విక్రయిస్తారు. వీరి లగ్జరీ గూడ్స్ కి మంచి మార్కెట్ ఉంటుంది. అలా ఆస్తులన్నీ క్రమంగా వృద్ది చెంది ప్రపంచంలోనే నంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ కొత్త కుబేరుడిపై ప్రస్తుతం అందరికీ ఆసక్తి నెలకొంది. ఈయన బ్రాండ్లను గురించి తెలుసుకోవడానికి చాలా ఆరాటపడుతున్నారు.
2021 తొలి త్రైమాసికంలోనే 14 బిలియన్ యూరోల ఆదాయం ఆర్నాల్ట్ సంస్థకు సమకూరింది. 2020తో పోలిస్తే 32 శాతం అదనంగా నమోదైంది. రెండో స్థానంలో ఉన్న బిజోస్ ఆస్తులు 186 బిలియన్ డాలర్లు. మూడో స్థానంలో ఎలెన్ మస్క్ ఆస్తుల విలువ 143.7బిలియన్ డాలర్లు