కరోనా: తెలంగాణలో సరికొత్త హెల్త్ బులిటెన్

Update: 2020-07-26 10:30 GMT
తెలంగాణలో కరోనా టెస్టులు, చికిత్సలో నిర్లక్ష్యం వహిస్తోందని అటు హైకోర్టు.. ఇటు సామాన్యుల నుంచి కూడా విమర్శలు రావడంతో కేసీఆర్ సర్కార్ గేరు మారుస్తోంది. ఇప్పటికే ఒకసారి హెల్త్ బులిటెన్ ను మార్చి కేసుల సంఖ్యను పెంచిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరోసారి సరికొత్త హెల్త్ బులిటెన్ ను ఆదివారం కొత్త ఫార్మాట్ లో విడుదల చేసింది.

శనివారం మొత్తం తెలంగాణలో 1593 కరోనా కొత్త కేసులు నమోదైనట్టుగా కొత్త హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 54059కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 12264 ఉన్నాయని పేర్కొన్నారు.  413312మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. తెలంగాణలో మరణాల సంఖ్య 463కి చేరింది. మరణాల రేటు 2.3శాతంగా పేర్కొన్నారు.

హైదరాబాద్ పరిధిలో అధికంగా 641 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 171 కొత్త కేసులు నమోదయ్యాయి.  

ఇక హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణలో శనివారం ఒక్కరోజే ఏకంగా 15654 కరోనా టెస్టులు నిర్వహించడం విశేషం. ఇందులో 1593 కేసులు బయటపడ్డాయి. దీంతో తెలంగాణలో మొత్తం టెస్టుల సంఖ్య 3.53 లక్షలకు చేరింది. ప్రతీ 10 లక్షలమందిలో 391 మందికి కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు.

తెలంగాణలో మొత్తం 39 చోట్ల కరోనా పరీక్షలు చేస్తున్నట్టుగా హెల్త్ బులిటెన్ లో వివరించారు. ఇక ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న బెడ్స్, వెంటిలేటర్స్ వివరాలు.. హెల్త్ బులిటెన్ వివరాలను బులిటెన్ లో పేర్కొనడం విశేషం.
Tags:    

Similar News