బాలీవుడ్ బాద్‌షా.. సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు.. రెక్కీ నిర్వహించారని స్వయంగా పంజాబ్ డీజీపీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ.. దేశంలోని పలు ప్రాంతాలపై ఒక్కసారిగా విరుచుకుపడింది. మొత్తం 60 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తోంది. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో ఉగ్రముఠాల హస్తం ఉందన్న అనుమానంతో ఈ సోదాలు నిర్వహిస్తోంది.
హరియాణా, పంజాబ్ సహా ఢిల్లీ, కర్ణాటక పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. పంజాబ్‌లో గ్యాంగ్స్టర్లు గోల్దీ బ్రార్, లోరిస్ బిష్ణోయ్, భగవాన్ పురియా ఇళ్లపై ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. కోటక్పురా, ఫరీద్ కోట్, రాజ్పురాలోని పలువురు గ్యాంగ్స్టర్ల్ ఇళ్లపై ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది. సిద్ధూ హత్యకేసులో ఉగ్రముఠాలతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
నీరజ్ బవానా, అతడి గ్యాంగ్.. ప్రముఖ వ్యక్తులే లక్ష్యంగా హత్యలకు పాల్పడుతున్నట్లు, సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు ఎన్ఐఏ చెబుతోంది. ప్రస్తుతం నీరజ్ గ్యాంగ్‌కు, లారెన్స్ బిష్ణోయ్‌కు మధ్య విభేదాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మూసేవాలా హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన మరణానికి లారెన్స్ గ్యాంగ్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని నీరజ్ బవానా ప్రకటించారు.
లారెన్స్, గోల్డీ బ్రార్ సహా పలువురు గ్యాంగ్‌స్టర్లు దేశంలోని పలు జైళ్లతో పాటు, కెనడా, పాకిస్థాన్, దుబాయ్ వంటి దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. సిద్ధూను హత్యచేసిన వారిలో చివరి షూటర్ దీపక్ ముండీతోపాటు అతని ఇద్దరు సహాయకులను బంగాల్‌లోని ఇండో-నేపాల్ సరిహద్దుల్లో పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నేపాల్ పారిపోతుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో మెుత్తం 35 మంది నిందితుల్లో 23మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. నలుగురు విదేశాల్లో ఉన్నారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.