గడచిన రెండేళ్ళుగా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచంలో 1.5 కోట్ల మంది చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఒక్క భారత్ లోనే సుమారు 47.40 లక్షలమంది చనిపోయుండచ్చని సమితి తన నివేదకలో స్పష్టం చేసింది.
అయితే ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా నివేదికపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సమితి అనుసరిస్తున్న మరణాల లెక్కింపు విధానాన్ని తప్పుపట్టింది.
కోవిడ్ కారణంగా ఇప్పటివరకు సుమారు 60 లక్షల మంది చనిపోయినట్లు ఆయా దేశాలే అధికారిక లెక్కలు విడుదల చేస్తున్న విషయాన్ని కేంద్రం గుర్తుచేసింది. అయితే ఆయా దేశాలిచ్చిన లెక్కలకు తాజాగా సమితి విడుదల చేసిన నివేదికలో మరణాలు రెండింతలున్నట్లు కేంద్రం ఆరోపించింది. 2020, జనవరి 1వ తేదీ నుంచి 2021, డిసెంబర్ 31వరకు యావత్ ప్రపంచంలో జరిగిన మరణాలను సమితి గుర్తించింది.
డైరెక్టుగా కోవిడ్ సోకడంతో చనిపోయిన వారు, మహమ్మారి ప్రభావం సమాజంపైన పడి మరణించిన వారి సంఖ్య 1.33 కోట్ల నుంచి 1.66 కోట్లుందని సమితి తన నివేదికలో స్పష్టం చేసింది. మరణాలకు సంబంధించి భారత్ లెక్కలకు తాము తయారుచేసిన లెక్కలకు మధ్య తేడా ఉండచ్చని కూడా సమితి తన నివేదికలోనే ప్రస్తావించింది. కేంద్ర ప్రభుత్వం విడుదలచేసిన అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు కోవిడ్ కారణంగా 5.33 లక్షల మంది చనిపోయారు.
అంటే కేంద్రం జారీ చేసిన అధికారిక లెక్కలకు, ఐక్యరాజ్యసమితి నివేదికలోని మరణాల సంఖ్య సుమారు 9 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. మిగిలిన ప్రపంచంలోని మరణాల సంగతిని పక్కనపెట్టేసినా భారత్ లో మరణాల విషయంలో సమితి నివేదికను తాము అంగీకరించేది లేదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్, నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ తెగేసిచెప్పారు.
ఇదిలాగుంటే మరణాల విషయంలో ఒక్క చైనాలోనే కోట్లమంది చనిపోయారనే ప్రచారం కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి ఏ దేశం కూడా కోవిడ్ మరణాలపై వాస్తవాలను బయటపెట్టడం లేదని అర్ధమైపోతోంది. ఈ నేపధ్యంలోనే సమితి నివేదికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.