పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో అమ్మాయిల సంఖ్య పెరిగింది..!
అమ్మాయిల సంఖ్య తగ్గిపోతుందని.. ఇక అబ్బాయిలకు పెళ్లిల్లు కావడం కష్టమేనని గత కొంతకాలంగా వార్తలు వచ్చేవి. అయితే జాతీయ కుటుంబసర్వే చెప్పిన సర్వే ప్రకారం.. తెలంగాణలో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉంది. తాజా లెక్కల ప్రకారం.. 1000 మంది అబ్బాయిలకు 1049 మంది అమ్మాయిలు ఉన్నారు. అయితే 2015–16లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1,007 మంది మహిళలు మాత్రమే ఉండేవారు. కానీ తాజాగా అమ్మాయిల సంఖ్య పెరిగింది.
పట్టణాల్లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1,015 మంది అమ్మాయిలు ఉండగా.. గ్రామాల్లో 1,070 మంది ఉన్నారు. జాతీయ సర్వేలో మరోవిషయం కూడా తేలింది. అదేంటంటే తెలంగాణలో గతంతో పోలిస్తే సిజేరియన్ల సంఖ్యపెరిగింది.
ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలు 57.7 శాతం ఉండగా, ఇప్పుడు 60.7 శాతానికి పెరిగాయి.
పట్టణాల్లో 64.3 శాతం కాగా, గ్రామాల్లో 58.4 శాతంగా ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐదేళ్ల క్రితం సిజేరియన్ ప్రసవాలు 74.5 శాతం కాగా, ఇప్పుడు 81.5 శాతానికి పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐదేళ్ల క్రితం సిజేరియన్ ప్రసవాలు 40.3 శాతం కాగా, ఇప్పుడు 44.5 శాతానికి పెరిగాయి.
మరోవైపు తెలంగాణలో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది.ఐదేళ్ల క్రితం ప్రతి 1000 మందికి 20 మంది మరణించేవారు. ఇప్పుడా రేటు 16 శాతానికి పడిపోయింది.