అమెరికా రాజకీయాల్లో సంచలనమైన.. భారత మూలాలున్న కమలా హ్యారీస్ ను టైం చెప్పి మరీ చంపేస్తానని బెదిరించిన ఒక నర్సు ఉదంతం పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఫ్లోరిడాకు చెందిన 39 ఏళ్ల నర్సు.. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్న 56 ఏళ్ల భారత సంతతి మహిళ కమలా హ్యారీస్ ను చంపేస్తానని బెదిరించటమే కాదు.. టైం చెప్పి మరీ లేపేస్తానని ప్రకటించటం షాకింగ్ గా మారింది. శారీరక దాడికి పాల్పడతానని.. సరిగ్గా యాబై రోజుల్లో చంపేయనున్నట్లుగా నివియానె పెటిట్ ఉద్దేశపూర్వకంగా పదే పదే బెదిరింపులకు దిగింది.
దీనికి సంబంధించిన వీడియో బయటకు రావటంతో.. యూఎస్ సీక్రెట్ సర్వీస్ రంగంలోకి దిగింది. సదరు నర్సు బ్యాక్ గ్రౌండ్ ను చెక్ చేసింది. ఆమె జాక్సన్ హెల్త్ సిస్టమ్ లో పని చేస్తోంది. ఆమె భర్త ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు.. ఉపాధ్యక్షురాలు కమలాపై తీవ్రమైన ద్వేషాన్ని ఆమె వ్యక్తం చేస్తుంటారు. జైల్లో ఉన్న తన భర్తకు పంపిన వీడియో సందేశాల్లో ఉపాధ్యక్షురాలిని యాభై రోజుల్లో చంపేస్తానని పేర్కొనటం షాకింగ్ గా మారింది.
తాను పిస్టల్ రేంజ్ లోకి వెళుతున్నానని.. దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను.. నువ్వు చనిపోతున్నావ్..రాసి పెట్టుకో అంటూ ఆవేశంతో ఊగిపోయింది. తాను వీడియో చేసిన రోజుకు యాభై రోజుల్లో తాను చంపేయనున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన సీక్రెట్ సర్వీసు వారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఈ ఫిబ్రవరిలోనూ గన్ లైసెన్సు తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు.