ఈ భూమి పై 71శాతం నీరు, 29శాతం భూభాగం కలదు. ఈ విషయం మన చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లిన సమయంలోనే చెప్పారు. దాదాపుగా అందరికి ఈ విషయం తెలుసు. అలాగే ఈ భూమిపై మొత్తం ఏడు ఖండాలుండగా, నాలుగు మహాసముద్రాలున్నాయి. అవి ఆర్కిటిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం. అంటూ చిన్నప్పటి నుంచీ చదివింది ఇప్పుడు కాస్త మారింది. మారడమంటే మరేంటో కాదు, మహాసముద్రాలు నాలుగు కాస్తా ఐదుగా గుర్తింపు పొందాయి.ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య నిలువుగా ఉండేది అట్లాంటిక్ మహా సముద్రం.. ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్య హిందూ మహా సముద్రం.. ఆసియా, ఆస్ట్రేలియాలకు, ఉత్తర, దక్షిణ అమెరికాలకు మధ్య అత్యంత భారీగా ఉండేది పసిఫిక్ మహా సముద్రం.. పైన ఉత్తర ధ్రువం ప్రాంతంలో ఉండేది ఆర్కిటిక్ మహా సముద్రం.
అయితే , తాజాగా మరొక మహా సముద్రం ఉందని నేషనల్ జాగ్రపీ కార్టోగ్రాఫర్స్ ప్రకటించారు. భూ మండలం మీద ఐదో మహా సముద్రం సదరన్ ఓషన్ అని గుర్తించినట్లు తెలిపారు. దక్షిణ (సదరన్) మహా సముద్రం. భూమి దక్షిణ ధ్రువ ప్రాంతంలో అంటార్కిటిక్ ఖండానికి చుట్టూ ఆవరించి ఉంది. ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీనే నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ దీనిని కొత్త మహా సముద్రంగా గుర్తిస్తూ.. మ్యాప్‌లో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఆమోదం రావాల్సి ఉంది. ఏ మహా సముద్రానికి కూడా మధ్యలో చిన్నా, పెద్ద దీవులు తప్ప ఖండాల వంటి భారీ భూభాగాలు లేవు. కానీ సదరన్ మహా సముద్రానికి మధ్యలో అంటార్కిటిక్ ఖండం ఉంటుంది. ప్రతి మహా సముద్రాన్ని ఖండాల మధ్య సరిహద్దులతో గుర్తిస్తే, సదరన్ మహా సముద్రాన్ని దాని చుట్టూ ఉండే భారీ సముద్ర ప్రవాహాం తో నిర్ధారించారు.
అంటార్కిటిక్ ఖండానికి రెండు, మూడు వేల కిలోమీటర్ల దూరంలో చుట్టూ, పైన ఉపరితలం నుంచి సముద్రం అడుగు వరకు అత్యంత భారీ ప్రవాహం తిరుగుతూ ఉంటుంది. దానిని అంటార్కిటిక్ సర్కమ్ పోలార్ కరెంట్ అంటారు. ఏసీసీ ప్రవాహానికి బయట పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహా సముద్రాల్లో నీళ్లు బాగా ఉప్పగా, కాస్త వేడిగా, తేలికగా ఉంటే, ప్రవాహానికి లోపల సదరన్ మహా సము ద్రంలో నీళ్లు తక్కువ ఉప్పగా, బాగా చల్లగా, కాస్త మందంగా ఉంటాయి. నేషనల్ జాగ్రఫీ సొసైటీ 1915 నుంచి మ్యాప్ లను తయారు చేస్తోంది. ఇప్పటి వరకు అట్లాంటిక్, పసిఫిక్, హిందూ, ఆర్కిటిక్ మహా సముద్రాలను గుర్తించింది. కొత్తగా సదరన్ ఓషన్‌ను ఐదో మహా సముద్రంగా ప్రకటించింది. అమెరికాకు చెందిన జాగ్రఫిక్ నేమ్స్ బోర్డు కూడా సదరన్ ఓషన్ ను గుర్తించింది. అంటార్కిటికా తీరం నుంచి 60 డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖ వరకు ఈ మహా సముద్రం వ్యాపించి ఉన్నట్లు తెలిపింది. నిజానికి దక్షిణ మహా సముద్రం (సదరన్ ఓషన్) సరిహద్దులను 2000వ సంవత్సరంలో ప్రతిపాదించారు. కానీ అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ గుర్తింపు పొందడం సాధ్యం కాలేదు.