హోం లోన్ తీసుకునే వారికి.. కొత్త పాత విధానంలో ఏది బెటర్?

Update: 2023-02-06 05:00 GMT
తాజా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే పలు వర్గాలకు అనేక రాయితీలను కల్పించడంతో కొన్ని రంగాలకు భారీ షాకిచ్చారు. అలాగే పన్ను శ్లాబుల్లో మార్పులు చేశారు. ఇందులో 7 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

ఇదొక్కటి ఉద్యోగ వర్గాలకు ఊరటనిచ్చే అంశమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ నిర్ణయం వల్ల 7లక్షల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే వారికి కొత్త ట్యాక్స్ రీజన్ కింద పెద్దగా ఒరిగేది ఏమీ లేదని టాక్స్ అకౌంటింగ్ నిపుణులు చెబుతున్నారు. హోమ్ లోన్ తీసుకున్న ఉద్యోగులకు పాత టాక్స్ విధానంలో చెల్లింపు చేయడమే ఉపయోగకరమని సూచిస్తున్నారు.

దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పాత విధానంలో పన్ను చెల్లిస్తే ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. టాక్స్ మినహాయింపు కావాలంటే పాత విధానమే తెలివైన నిర్ణయమని పేర్కొంటున్నారు. కేంద్రం ప్రకటించిన కొత్త ట్యాక్స్ విధానంలో ఎవరైనా ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు వారి ఆదాయం ఏడు లక్షల లోపు అయితే ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

అదే ఏడు లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే తాజాగా ప్రకటించిన శ్లాబ్ రేట్ల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో నష్టం ఏమిటంటే పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి రిబేట్స్ లభించవు. దీంతో కొత్త టాక్స్ విధానం కింద హోమ్ లోన్ చెల్లింపులకు ఎలాంటి పన్ను మినహాయింపును వీరు పొందలేరు.

ఎక్కువ ఆదాయం ఉన్నవారికి పాత టాక్స్ విధానాన్నే మేలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికింద పలు సెక్షన్ల ప్రకారం పన్ను మినహాయింపులు లభించనున్నాయి.  ఉదాహరణకు హోమ్ లోన్ తీసుకుని పాత టాక్స్ విధానం కింద ఐటీఆర్ ఫైల్ చేసినట్లయితే చెల్లించే వడ్డీలో గరిష్టంగా రెండు లక్షల వరకు టాక్స్ తగ్గింపు లభిస్తుంది.

అలాగే లోన్ అసలు చెల్లింపు కింద గరిష్ఠంగా ఏడాదికి రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభించనుంది. ఇలాంటి తగ్గింపులు కొత్త టాక్స్ విధానంలో లేవు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నట్లు అయితే కొత్త టాక్స్ విధానంలో మినహాయింపులు ఉండదు. అదే పాత విధానంలో అయితే ఐటీఆర్ ఫైల్ చేస్తున్నట్లయితే హెచ్ఆర్ఏను మినహాయింపుగా పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News