ఏపీలో విగ్రహాల వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం తరుఫున ప్రకటిస్తే బీజేపీ, టీడీపీలు కారాలు మిరియాలు నూరి ఏకంగా డీజీపీనే బెదిరించిన వైనం చర్చనీయాంశమైంది. దీనిపై వైసీపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే సాక్ష్యాలు బయటపెట్టాలంటూ చాలా సార్లు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే అనూహ్యంగా తాజాగా ప్రతిపక్ష పార్టీ నేతలు దొరికిపోయినట్టు సమాచారం.
శ్రీకాళుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఉన్న నంది విగ్రహాన్ని తొలగిస్తూ ఓ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు అడ్డంగా బుక్కయ్యారు. తొలగించిన విగ్రహాన్ని సమీపంలోని మూడు రోడ్ల కూడలిలో ఉన్న సిమెంట్ దిమ్మెపైకి తరలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో ఆ నేతల బండారం బయటపడింది.
సంతబొమ్మాళిలోని అతి పురాతన పాళేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 14న నందివిగ్రహం తొలగింపు వివాదాస్పదమైంది. గ్రామస్థులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించగా ప్రతిపక్ష పార్టీ నేతలే నంది విగ్రహాన్ని తరలించారన్న విషయం వెలుగుచూసింది.
ఈ మేరకు విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు క్లారిటీ ఇచ్చారు. విగ్రహ తరలింపు వెనుక దురుద్దేశం ఉందని తెలిపారు. గుట్టుగా రోడ్డు మధ్యలో విగ్రహాన్ని పెట్టాలని చూశారని తెలిపారు. మొత్తం ఆరుగురిని ఈ కేసులో అరెస్ట్ చేసినట్టు తెలిపారు.ఇందులో ప్రతిపక్షాలకు చెందిన నలుగురు ఉన్నారని తెలిపారు.