జగన్ స్వయంకృతం.. తప్పులు సరిచేసుకుంటారా ..!
అలాంటి వారే.. వైసీపీ అధికారంలోకి వస్తుందని లెక్కలు వేసుకుని 2019కి ముందు వైసీపీలోకి చేరారు.
వైసీపీలో పదవులు పొందిన వారు.. చాలా మంది ఆయారాం.. గయారాంలే ఉన్నారన్నది వాస్తవం. వారు ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే అటువైపే ఉంటారు. వారికి కావాల్సింది.. అధికారం మాటున వ్యాపారాలు చేసుకోవడమే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వారే.. వైసీపీ అధికారంలోకి వస్తుందని లెక్కలు వేసుకుని 2019కి ముందు వైసీపీలోకి చేరారు. ఇప్పుడు వారే.. తిరిగి కూటమిలోకి వెళ్లారు. మరికొందరు కూడా ఇదే బాటలో ఉన్నారు.
వీరిని తప్పుపట్టేవారు ఉన్నా.. ఏ నాయకుడికైనా అంతిమ లక్ష్యం అధికారమే కాబట్టి.. దీనిని తప్పు పట్టా ల్సిన అవసరంలేదని చెప్పేవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం వైసీపీని వదిలేసిన వారిలో ఒకరిద్దరు మాత్రమే జగన్ విధానాలు తప్పని చెప్పి పార్టీ మారారు. మిగిలిన వారంతా కూడా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకులే కావడం గమనార్హం. ఎవరి లక్ష్యం వారిదే. అయితే.. అసలు తెలుసు కోవాల్సింది.. పార్టీల అధినేతలే. ఎవరికి పదవులు ఇస్తే.. మేలనే విషయాన్ని నాయకులే ఆలోచించుకోవాలి.
ఈ విషయంలో జగన్ ఆలోచలను తప్పనేది ఎప్పుడో రుజువైంది. అయినప్పటికీ.. ఆయన మొండిగా ముందుకు సాగిన ఫలితంగా ఇప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోయే వారిని చూసి ఎవరూ పార్టీపై జాలి పడడం లేదు. పైగా జగన్‌కు తగిన శాస్తి జరిగిందనే కామెంట్లు వినిపించేలా పరిస్థితి కనిపిస్తోంది. పార్టీని నమ్ముకు ని ఉన్నవారి కంటే.. కూడా అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి పదవులు ఇవ్వడం.. ప్రాధాన్యం ఇవ్వడం వంటివి జగన్‌కు మేలు చేయకపోగా.. కీడునే ఎక్కువగా చేశాయన్నది వాస్తవం.
ఈ నేపథ్యంలోనే జగన్ తెలుసుకోవాల్సింది.. చాలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. పార్టీని కాపా డుకునేందుకు ఎవరు ప్రయోజనకరంగా ఉంటున్నారో.. ఆయన తెలుసుకుని.. వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆమంచి కృష్ణమోహన్ వంటి వారిని వదులు కోవద్దని.. చాలా మంది చెప్పినా వినక పోవడం.. సర్వేల పేరుతో కొత్తవారికి పదవులు ఇవ్వడం.. ముక్కు మొహం తెలియని వారిని నిలబెట్టడం వంటివి జగన్ కు అపార నష్టం కలిగించాయి. ఇప్పటికైనా జగన్ తెలుసుకుని తప్పులు సరిదిద్దుకుంటే మేలు జరుగుతుందని పరిశీలకులు చెబుతున్నారు.