తాను ఎవరి జట్టు కడితే.. వారు ఎన్నికల్లో విజయం సాధించేలా చేయటంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కున్న ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేయటం.. మొదట్లో ఆసక్తి చూపిన సోనియా తర్వాత ఆయన్ను దూరం పెట్టారు. తాజాగా ఆయన్ను మరోసారి చేరదీశారు. ఆయన చెబుతున్న మాటల్ని జాగ్రత్తగా వింటున్నారు.
పీకే చెబుతున్న విషయాల్ని సోనియా విశ్లేషిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధినేత్రితో భేటీ అయిన పీకే.. ఒక ప్రజంటేషన్ ఇచ్చారని.. అందులో కాంగ్రెస్ విజయవకాశాలు.. వాటిని సాధించటానికి అవసరమైన వ్యూహాల్ని వివరించినట్లుగా చెబుతున్నారు.
మిగిలిన ప్రజంటేషన్ సంగతి ఎలా ఉన్నా.. కాంగ్రెస్ అనుసరించాల్సిన రెండు వ్యూహాల గురించి వివరించిన వైనం సోనియాను ఆకట్టుకుందని చెబుతున్నారు. ఇప్పుడీ ప్లానింగ్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ సోనియమ్మకు పీకే ఏం చెప్పారు? ఆ రెండు దశల వ్యూహం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..
మొదటి వ్యూహం
యూపీఏ ఛైర్మన్ ను పాతతరం కాంగ్రెస్ నాయకుడికి అప్పజెప్పటం.. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగటం. వర్కింగ్ ప్రెసిడెంట్ గా గాంధీయేతర కుటుంబ సభ్యుడ్ని నియమించటం. పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా రాహుల్ గాంధీని ఎన్నుకోవటం .. కోఆర్డినేషన్ జనరల్ సెక్రటరీగా ప్రియాంకా గాంధీని నియమించటంగా చెబుతున్నారు.
రెండో వ్యూహం
సోనియాను యూపీఏ ఛైర్ పర్సన్ గా ఎన్నుకోవటం.. కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని నియమించాలి. పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా రాహుల్ గాంధీ.. కోఆర్డినేషన్ జనరల్ సెక్రటరీగా ప్రియాంకా గాంధీని ఎన్నుకోవాలి. రాహుల్ ను పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా ఎంపిక చేయటం ద్వారా చట్టసభలో ప్రధాని మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా మారుతుందని చెబుతున్నారు. దీంతో ప్రజల గొంతును పార్లమెంటు బయటా.. లోపలా బలంగా వినిపించే వీలుందన్న యోచనను ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇక నుంచి పక్కాగా పార్టీలో ఒక వ్యక్తి ఒకే పదవి అన్న సిద్దాంతాన్ని ఫాలో కావాలని.. దేశ వ్యాప్తంగా 15 వేల మంది నిబద్ధత కలిగిన నాయకుల్ని.. కోటి మంది క్రియాశీలక కార్యకర్తల్ని గుర్తించి.. పార్టీ బాధ్యతల్ని వారికి అప్పగించాలన్నారు. అప్పుడే కాంగ్రెస్ కు పూర్వ వైభవం మళ్లీ వస్తుందన్న మాట చెప్పినట్లుగా సమాచారం. కాంగ్రెస్ ను పాన్ ఇండియా పార్టీగా విస్తరించే అంశం మీద ఫోకస్ చేసి.. మరో విభాగం 2024లో జరిగే ఎన్నికలకు అవసరమైన ‘ఆయుధాల్ని’ సమకూర్చుకునేలా పీకే ప్లానింగ్ ఉందన్న మాట వినిపిస్తోంది.