కోవిడ్ కేసులు పెరగడానికి కారణం యువతే..!

Update: 2021-03-26 00:30 GMT
గత ఏడాది ఉగ్రరూపం చూపించిన కరోనా.. ఈ సారి కూడా తన ప్రతాపాన్ని చూపుతున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే కరోనా కేసులు ఈ స్థాయిలో పెరగడానికి కారణం యువతేనని  శాస్త్రవేత్తలు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మనదేశంలో కరోనా తీవ్రత తగ్గగానే.. అన్ని సేవలను పునరుద్ధరించారు. లాక్​డౌన్​ నిబంధనలు సడలించి పబ్​ లు, క్లబ్బులు, బీచ్​ లు ఓపెన్​ చేశారు. బార్లు, రెస్టారెంట్లు, టూరిస్ట్​ స్పాట్​ లు కూడా తెరుచుకున్నాయి. దీంతో యువత కరోనా తగ్గిపోయిందని భావించి విచ్చలవిడిగా టూర్​ లు ప్లాన్ చేసుకున్నారు.

మనదేశంలో కరోనా కేసులు తగ్గిపోవడంతో వీకెండ్​ పార్టీలు అంటూ ఎంజాయ్​ చేశారు. ఈటైంలోనే విచ్చలవిడిగా గుంపులు కూడారు. ఇక పార్టీలు, పంక్షన్లు యథాతథంగా సాగాయి. చాలా కాలం పాటు ఇంటికి పరిమితం అయి ఉండటంతో ఒక్కసారిగా అవకాశం దక్కడంతో ఎంజాయ్​ చేశారు. ఇదే కొంప ముంచిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా తగ్గిపోయిందని భావించిన యువత మాస్కులను పక్కకు పడేశారు. భౌతిక దూరం అనే సంగతి మరిచిపోయారు. వెరసి కరోనా కేసులు విపరీతంగా పెరిగుతున్నాయి. అయితే వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక కూడా ఇందుకు అద్దం పడుతున్నది. ఇటీవల నమోదైన కేసుల్లో యువతే ఎక్కువగా బాధ్యులుగా ఉండటం గమనార్హం.

21 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నవాళ్లు 23.66 శాతం మంది కరోనా బారిన పడ్డారు.  31 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్నవాళ్లు 23.04 శాతం మంది కరోనా బారిన పడ్డారు. ఇవి వైద్యశాఖ ఇచ్చిన నివేదిక. యువతలో ప్రస్తుతం కరోనా అంటే భయం పోయిందని వృద్ధులు కరోనాకు భయపడి ఇంటికి పరిమిత మయ్యారని.. చిన్నపిల్లలను కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటున్నారని శాస్త్ర వేత్తలు అంటున్నారు.కానీ యువత మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అందుకే వారిలో కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా యువత జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
Tags:    

Similar News