దేశ ప్రతిష్ట చెడగొట్టేందుకు కుట్ర జరుగుతోందా ?

Update: 2021-02-07 16:30 GMT
దేశ ప్రతిష్ట చెడగొట్టేందుకు ఢిల్లీ కేంద్రంగా కుట్ర జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోడి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. దేశాన్ని అపఖ్యాతిపాల్జేసేందుకు కొన్ని దుష్టశక్తులు రైతుఉద్యమంలో కలిసిపోయినట్లు మోడి చెప్పారు. దేశాన్ని అపఖ్యాతి చేసేందుకు దుష్టశక్తులన్నీ కలిసి కుట్ర చేస్తున్నట్లు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోంది. అస్సాంలో తొందరలో ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో మోడి ఆదివారం అస్సాం, పశ్చిమబెంగాల్లో పర్యటించారు.

అస్సాంలోని సోనిట్ పూర్ జిల్లా పర్యటనలో తేయాకు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇండియా బయట నివసిస్తున్న కొందరు వ్యక్తులు మన దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రపన్నుతున్నట్లు చెప్పారు. ప్రధానంగా ఇండియన్ చాయ్ (తేయాకు) ను దెబ్బతీసేలా ప్రయత్నాలు జరుగుతోందన్నారు. ఈ కుట్రలో కొన్ని రాజకీయపార్టీల ప్రతినిధులు కూడా ఉన్నట్లు తమకు కచ్చితమైన డాక్యుమెంట్ల ఆధారాలతో సమాచారం ఉందన్నారు.




Tags:    

Similar News