మాధవ్ వీడియో ఒరిజినల్ అని చెప్పిన నివేదిక ఫేక్

Update: 2022-08-18 14:30 GMT
ఏపీలో ఎంపీ గోరంట్ల మాధవ్ పేరిట చలామణీలో ఉన్న న్యూడ్ వీడియో మీద పెద్ద రాజకీయ రచ్చ సాగుతోంది. దీని మీద విపక్ష తెలుగుదేశం అయితే చాలానే పోరాడుతోంది. ఈ నేపధ్యంలో ఏపీ సీఐడీ విభాగం చీఫ్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మాధవ్ పేరిట చలామణీలో ఉన్న వీడియో ఒరిజినల్  అని  సర్టిఫై  చేస్తూ  ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ఫేక్ అని చెప్పడం విశేషం.

నిజానికి అది ఒక వీడియో కాల్ అని ఇద్దరు అటూ ఇటూ మాట్లాడుకుంటున్న ఆ వీడియో కాల్ ని మూడవ వ్యక్తి తీసి సామాజిక మాధ్యమాలలో చలామణీలో తెచ్చారని సునీల్ కుమార్ చెప్పారు. నిజానికి మూడవ వ్యక్తి ఎవరు వీడియో తీసినా ఏ ల్యాబ్ అయినా దాన్ని ఒరిజినలా కాదా అన్నది నిర్ధారించలేదని సునీల్ కుమార్ చెప్పారు. ఒక సినిమాలో వచ్చే సీన్లను హాలు లో ప్రేక్షకుడు మొబైల్ ద్వారా రికార్డు చేసి ల్యాబ్ కి పంపించినా ఒరిజినల్ అనే వస్తుందని ఆయన అన్నారు.

అయితే అసలు కంటెంట్ ఒరిజినల్ అవునా కాదా అన్నది తెలియాలి అంటే షూటింగ్ చేసిన వారే అవుట్ పుట్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పారని అన్నారు. ఇక్కడ ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్ లో ఒరిజినల్ కంటెంట్ ఏంటి అన్నది తెలియాలీ అంటే వారిద్దరి వీడియో కాల్  డేటాను విశ్లేషిస్తే అది ఒరిజినల్ అవునా కాదా అని చెప్పగలమని సునీల్ కుమార్ చెప్పారు.

ఇదిలా ఉండగా ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్  తరఫున జిమ్ స్టాఫోర్డ్ అనే వ్యక్తి ల్యాబ్ రిపోర్టు ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ సర్టిఫికేట్ ఒరిజినల్ అవునా కాదా అని తాము నిగ్గు తేల్చేందుకు జిమ్ అన్న వ్యక్తిని ఈ మెయిల్ ద్వారా సంప్రదించామని, ఆయన తన పేరిట సోషల్ మీడియాలో చలామణీ అవుతున్న సర్టిఫికేట్ ఒరిజినల్ కాదని ఏపీ సీఐడీ విభాగానికి ఈ మెయిల్ పంపారని సునీల్ కుమార్ చెప్పారు.

ఇలా ఏ మాత్రం బాధ్యత లేకుండా ఫేక్ సర్టిఫికేట్ ని తీసుకొచ్చి ఒరిజినల్ అని ప్రచారం చేస్తున్న వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పోతిని ప్రసాద్ అన్న వ్యక్తి ఈ రిపోర్టుని కోరారని కూడా జిమ్ స్టాఫోర్డ్ తెలిపారు. అయితే తాను దాని గురించి ఆలోచించే లోపే మార్పులు చేర్పులు చేసి ఆ రిపోర్టుని  విడుదల చేశారని  జిమ్ స్టాఫోర్డ్  తమకు చెప్పినట్లుగా కూడా సునీల్ కుమార్ పేర్కొన్నారు. మొత్తానికి ఒరిజినల్ వీడియో అయితే ఉందని జిమ్ స్టాఫోర్డ్  పేరిట సర్క్యులేట్ అవుతున్నది మాత్రం ఫేక్ అని సునీల్ కుమార్ చెప్పారు.

ఇదిలా ఉంటే ఈ వీడియో ఫేక్ అని సర్టిఫికేట్ కూడా ఫేక్ అని తేలిన నేపధ్యంలో బాధ్యులైన టీడీపీ వారి మీద యాక్షన్ తీసుకోవాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేయడం విశేషం.
Tags:    

Similar News