జనసేన. ఎనిమిదేళ్ల వయసున్న నవ యవ్వన పార్టీ. నిజానికి ఈ మాత్రం వయసుకే అధికారంలోకి వచ్చిన పార్టీలు ఉన్నాయి. కానీ, జనసేన మాత్రం గౌరవ ప్రతిపక్షం స్థానంలోకి కూడా రాలేదు. గత ఎన్నికల్లో ఘరోంగా ఓడిపోయింది. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణే రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు.
ఇక, మేధావులు... విద్యావంతులు.. జనసేన అధినేత సోదరుడు.. నాగబాబు వంటివారు కూడా కొట్టుకుపోయారు. ఇది.. గతం. 2019లో ఎన్నికలు జరిగిన తర్వాత.. ఈ రెండున్నరేళ్ల కాలంలో.. జనసేన పుంజుకుంది. ఆపార్టీ అధినేత.. పవన్ ప్రమేయం లేకుండానే.. స్థానిక ఎన్నికల్లో జనసైనికులు విజయం దక్కించుకుంటున్నారు.
పవన్ ప్రచారం లేదు. ఆయన డైలాగులు లేవు. కేవలం ఆయన జెండా మాత్రమే కనిపిస్తోంది. నాయకులు ఇంటింటికీ తిరిగారు. ప్రజలనుమెప్పించారు. మేం అండగా ఉంటామని చెప్పారు. ఫలితంగా.. ఈ ఏడాది మార్చిలో జరిగిన స్థానిక సమరంలో కావొచ్చు.. ఇటీవల జరిగిన 12 మునిసిపాలిటీలు.. నెల్లూరు కార్పొరేషన్, ఇతర ఎన్నికల్లో కావొచ్చు.. జనసేనకు ఊహించనివిధంగా ఫలితం మెరుగైంది.
దీనిని తక్కువగా అంచనా వేసేందుకు అవకాశం లేదు. ఎందుకంటే.. గత ఎన్నికల తర్వాత.. తమకు తిరుగులేదని.. తమకే ప్రజలు పట్టం కడుతున్నారని.. చెప్పుకొచ్చిన ప్రధాన పార్టీ వైసీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో జనసేన నేతలు.. ఒకటి అరా అయినా.. విజయం సాధించడాన్ని తక్కువగా చేసి చూడలేం.
దీనిని బట్టి జనసేన ఆశావాదం వైపు జనాలు చూస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే.. పార్టీని పటిష్టం గా ముందుకునడిపించే నాయకుడే ఇప్పుడు నిలబడాల్సిన తరుణం ఆసన్నమైంది. సమయానికి తగు మాటలాడి.. అనే ధోరణిని ఇప్పుడు ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి. మారుతున్న కాలానికి అనుగుణంగా.. నిరంతరంవారికి టచ్‌లో ఉండాలి. వారి సమస్యలకు పరిష్కారం వెతికే నాయకుడు కావాలి.
అప్పుడు ఖచ్చితంగా గెలుపు గుర్రం ఎక్కడం ఈజీనే అవుతుంది. మరి ఆదిశగా జనసేన అధినేత పవన్ చేస్తున్న ప్రయత్నం ఏది? ఎక్కడ? ఇదే ఇప్పుడు.. ప్రశ్నగా.. మారుతోంది. తన ప్రమేయం లేకున్నప్పటికీ.. ఆకివీడులో మూడు వార్డులు గెలుచుకున్న పార్టీగా జనసేన కు ఇక్కడి ప్రజలు ఆదరణ చూపిస్తున్నారనే విషయం స్పష్టమైంది.