అదే జోరు.. అదే స్పీడు.. యువ క్రికెటర్లకు ఏమాత్రం తగ్గని సచిన్

Update: 2020-11-01 11:50 GMT
సచిన్​ టెండుల్కర్​..ఇండియన్ క్రికెట్ దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు. దశాబ్దాలపాటు జనం మదిలో క్రికెట్ అంటే సచిన్..సచిన్ అంటే క్రికెట్ అనేలా ఆయన ముద్ర వేశారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో 100 సెంచరీలు చేసిన  ఏకైక బ్యాట్స్ మెన్ సచిన్. ఆయన సుమారు ఇండియన్ క్రికెటర్ గా 24 ఏళ్లు కొనసాగి సుదీర్ఘ కాలం సేవలు అందించినా సచిన్ రిటైర్ ప్రకటించినప్పుడు బాధ పడని ఇండియన్ లేడు. అంతలా ఆయన ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నాడు.క్రికెట్ ని వదిలేసి చాలా ఏళ్ళైనా సచిన్ తర్వాత ఆయన లాగా దిగ్గజాలు అనిపించుకున్న ధోనీ, విరాట్ కోహ్లీతో పోలిస్తే సచిన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.యాడ్స్ విషయంలో కూడా వీరిద్దరికీ సచిన్ సవాల్ విసురుతున్నాడు.

దేశంలో  ఇప్పటికీ అతడిని అభిమానించే వాళ్ల సంఖ్య కోట్లల్లోనే ఉంది. వివిధ బ్రాండ్లకు  ప్రచారకర్తగా వ్యవహరించే విషయంలో సచిన్​ టెండుల్కర్​ యువ క్రికెటర్లతో పోటీపడుతున్నాడు.  సచిన్​ క్రికెట్​ను వీడి చాలా ఏళ్లు  గడిచినా అతన్ని అభిమానించే వాళ్లు కోట్లల్లోనే ఉన్నారు. ఇది దృష్టిలో ఉంచుకొనే పలు కంపెనీలు ఇంకా సచిన్​ను బ్రాండ్​ అంబాసిడర్​గా కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం అతడు దాదాపు 18 బ్రాండ్లకు ప్రచారకర్తగా కొనసాగుతున్నాడు. సచిన్​ ఆటగాడిగా  ఉన్నప్పుడు ఏ రకంగా అయితే అతడికి ప్రకటనల ఆఫర్లు వచ్చేవో..  ఇప్పటికీ అదే రేంజ్​ లో వస్తున్నాయి. కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్​గా కొనసాగడంలో సచిన్​ యువ క్రికెటర్లతో ఏ మాత్రం తగ్గడం లేదు. గతంతో పోలిస్తే కొద్దిగా ఆదాయం తగ్గింది అంతే. ఆట విడిచి ఇంకా ఆ క్రేజ్ కొనసాగించడం, బ్రాండ్ అంబాసిడర్ గా పలు ఆఫర్లు అందుకోవడం సచిన్ కే చెల్లింది.
Tags:    

Similar News