సెకండ్ వేవ్ లో అదే ప్రధాన లక్షణమట..

Update: 2021-04-12 06:30 GMT
కరోనా వచ్చింది ఎలా తెలుస్తుంది? గొంతులో నొప్పితో మొదలు కావటం ప్రధాన లక్షణంగా ఉండేది. అదే సమయంలో జ్వరం కూడా ఒక లక్షణంగా ఉండేది. ఫస్ట్ వేవ్ లో ఇలాంటి లక్షణాలు కనిపించేవి. ఇవి కనిపిస్తే చాలు.. కన్ఫర్మ్ గా కరోనానే. పరీక్షలు చేసినంతనే ఫలితం కూడా అదే వచ్చేది. ఇప్పుడు సెకండ్ వేవ్ లో రోగ లక్షణాలు మారుతున్నాయి. గతంలో మాదిరి గొంతు నొప్పి రావటం.. రుచి.. వాసన కోల్పోవటం లాంటి లక్షణాలు కనిపించటం లేదు.

సెకండ్ వేవ్ లో ఎక్కువగా నీరసం ప్రధాన లక్షణంగా మారింది. నీరసంగా ఉంటే చాలు.. కరోనా అన్న అనుమానానికి రావాల్సి వస్తోంది. పరీక్ష చేస్తే..పాజిటివ్ అని తేలుతోంది. ఇతర లక్షణాలు ఏమీ లేకుండా నీరసం.. మరింత వివరంగా చెప్పాలంటే.. వడదెబ్బ తగిలితే ఎలాంటి ఇబ్బంది ఉంటుందో.. అలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.

నీరసంతో పాటు బాడీ పెయిన్స్.. జ్వరంలాంటి లక్షణాలు ఎక్కువగా వస్తున్నట్లు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు చెబుతున్నారు. జీవితంలో ఇంతకు ముందెప్పుడు లేనంత నీరసంగా ఉంటుందని కొందరు పేషెంట్లు చెబుతున్నట్లు ఆయన చెబుతున్నారు. నీరసం లక్షణం.. త్వరగా అలిసిపోవటం.. చిన్న పని కూడా చేసుకోలేనంతగా ఇబ్బంది పడటం లాంటి లక్షణం కనిపిస్తే... ఆలస్యం చేయకుండా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అయితే.. అందరికి ఇదే లక్షణం ఉండాల్సిన అవసరం లేదని.. ఎక్కువ మందిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. అంటే.. కరోనా అన్నంతనే ఇప్పటివరకు తెలిసిన లక్షణాల చిట్టాలో వీటిని కూడా చేర్చుకుంటే మంచిది.
Tags:    

Similar News