'మునుగోడు' బీజేపీలోనూ ఇదే ప్రాబ్లంగా ఉంద‌ట‌!

Update: 2022-09-12 07:35 GMT
ఎందుకొచ్చిన ఉప ఎన్నికో.. అంటూ.. మునుగోడు ఉప ఎన్నిక‌పై.. బీజేపీ నాయ‌కులు త‌ల‌ప‌ట్టుకుంటున్నా రు. ఈ సీటును ద‌క్కించుకుని.. త‌మ స‌త్తా చాటాల‌ని.. నాయ‌కులు శ‌త విధాల ప్ర‌య‌త్నిస్తున్నారు. అయి తే.. అటు కాంగ్రెస్‌లో ఉన్న‌ట్టుగానే.. ఇటు బీజేపీలోనూ.. స‌మ‌స్య‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. కాంగ్రెస్‌లో ఎలా అయితే.. అసంతృప్తి జ్వాల‌లు పెల్లుబుకుతున్నాయో.. ఇప్పుడు బీజేపీలోనూ అదే ప‌రిస్థితి క‌నిపిస్తోం ద‌ని అంటున్నారు. కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ టికెట్ ఆశించి భంగ ప‌డిన వారు.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో వారిని బుజ్జ‌గించేందుకు పార్టీ రాష్ట్ర నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. అసం తృప్తులు.. పార్టీ నేత‌ల‌కు చిక్క‌కుండా.. వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే అసంతృప్తి జ్వాల‌.. బీజేపీలోనూ రాజుకుంటోంది.

గ‌త ఎన్నిక‌ల్లోనూ.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా మునుగోడులో .. కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డికి వ్య‌తిరేకంగా.. బీజేపీ స్థానిక నాయ‌కులు చ‌క్రం తిప్పారు. అంతేకాదు.. కోమ‌టిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో 'గ‌ద్ద' అంటూ.. రాజ‌గోపాల్‌పై పోస్ట‌ర్లు కూడా వేశారు. అలాంటి ప‌రిస్థితి నుంచి ఇప్పుడు ఒక్క‌సారి యూట‌ర్న్ తీసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది.

అంటే.. అదే రాజ‌గోపాల్‌కు అనుకూలంగా మునుగోడులో ప్ర‌చారం చేయాల్సిన ప‌రిస్థితి బీజేపీ నేత‌ల‌కు వ‌చ్చింద‌న్న మాట‌. దీంతో ఇప్పుడు ఈ ప‌రిస్థితిని స్థానిక నాయ‌కులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్ర‌మంలోనే వారు.. పార్టీ నేత‌ల‌కు చిక్క‌కుండా..

ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుంటున్నార‌ట‌. ఎక్క‌డ ఫోన్‌కు దొరికితే.. ప్ర‌చారానికి పిలుస్తారో.. అని నాయ‌కులు దూరంగా ఉంటున్నారు. అయితే.. ఈ విష‌యంపై ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టిన బండి సంజ‌య్‌... పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సంగ్రామ యాత్ర రాష్ట్ర ప్రముఖ్‌ గంగిడి మనోహర్‌రెడ్డి, జనరల్‌ సెక్రటరీ ప్రదీప్ కుమార్‌ను మునుగోడుకు పంపారు.

ఈ ఇరువురితోపాటు చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీ వివేక్‌, తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు.  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్ నేతృత్వంలో స్థానిక నేత‌ల‌కు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించి.. అసంతృప్తిని చ‌ల్ల‌బ‌ర‌చాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.  మ‌రి ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News