ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ముందు ఎన్నోసార్లు పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్ ఇప్పుడు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ చేసిన పనికి మరొకసారి నవ్వులపాలైంది. ఐరాస సమావేశానికి వెళ్లే ముందు పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సౌదీ పర్యటనకు వెళ్ళాడు. అక్కడినుండి అమెరికా వచ్చేటపుడు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ తన స్వంత ఫ్లయిట్ ఇచ్చి ఇమ్రాన్ ను అమెరికా పంపించాడు. ఇమ్రాన్ తన పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తి తిరిగి న్యూయార్క్ వచ్చేశాడు. అక్కడి నుండి పాక్ కి ఒక సాధారణ ఫ్లైట్ లో వచ్చాడు ఇమ్రాన్.
అయితే ఇదంతా అబద్దమని... అసలు జరిగింది వేరని అంటుంది ఫ్రైడే టైమ్స్ పత్రిక. ఇమ్రాన్ ఐరాసలో ప్రసంగించిన విధానం, అతని దౌత్య నీతి నచ్చక తన ఫ్లైట్ ను తితిగి అప్పగించాలని ఇమ్రాన్ ని యువరాజు హెచ్చరించారని ఈ పత్రిక చెప్తుంది. తమతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇరాన్ తో చర్చలు జరపడం కూడా సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కోపానికి ఒక కారణమైందని తెలుస్తుంది. అంతేకాదు టర్కీ అధక్షుడు ఎర్డోగన్, మలేషియా ప్రధాని మహతిర్ లతో కలిసి ఇస్లామిక్ దేశాల వాదన చెప్పడం కూడా యువరాజు ఇష్టపడలేదని తెలుస్తుంది. అందుకే తన ఫ్లైట్ తనకు వెంటనే తిరిగి అప్పగించాలని మహమ్మద్ బిన్ ఇమ్రాన్ ని హెచ్చరించినట్టు ఆ పత్రిక పేర్కొంది.