విద్యార్థి ఫ్యామిలీకి రూ.14.5 కోట్ల పరిహారాన్ని ఆ స్కూల్ ఎందుకిచ్చింది?

Update: 2021-03-27 00:30 GMT
ప్రపంచంలోని మరే దేశంలో బతికే మనిషి ప్రాణానికి విలువ ఇవ్వని అగ్రరాజ్యం.. తన దేశంలోని పౌరుల విషయంలోతీసుకునే జాగ్రత్త.. ఇచ్చే ప్రాధాన్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దేశ ప్రయోజనాల కోసం మంది ప్రాణాల్ని ఊచకోత కోసేందుకు సైతం సై అనే అగ్రరాజ్యం.. ఒక మానసిక వికలాంగుడైన విద్యార్థి మరణంపై ఎంత సున్నితంగా.. మరెంత తీవ్రంగా స్పందించిందనటానికి తాజా ఉదంతం ఉదాహరణగా చెప్పొచ్చు.

దాదాపు ఏడాదిన్నర క్రితం మానసిక వికలాంగుడైన విద్యార్థి కేదార్ విలియన్స్ స్కూల్లో చికెన్ నగెట్స్ తింటూ గొంతులో ఇరుక్కుపోయి..మరణించాడు. తమ పిల్లాడి మరణానికి కారణం స్కూల్ నిర్లక్ష్యమని బాధిత విద్యార్థి కుటుంబం కోర్టులో సవాలు చేయటంతో పాటు.. ఆహారం తినే విధానంపైనా స్కూల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్న డిమాండ్ చేశారు. దీంతో.. ఈ కేసు విచారణ సాగింది. వాదోపవాదాలుసాగిన తర్వాత.. స్కూలు వారు బాధిత విద్యార్థి కుటుంబంతో రాజీ చర్చలు జరిపారు.

చివరకు రూ.14.5 కోట్ల పరిహారాన్ని ఇచ్చేందుకు స్కూలు సిద్ధమైంది. అంతేకాదు.. కేదార్ విలియమ్స్ పేరుతో ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని కోర్టు సిఫార్సు చేసింది. ప్రతి స్కూల్లోనూ విద్యార్థులు ఆహారాన్ని తీసుకునే విషయంపై శిక్షణ ఇవ్వాలని.. కేదార్ లా మరో విద్యార్థి జీవితం నష్టపోకూడదన్న తల్లిదండ్రుల వాదనను కోర్టు మన్నించింది. తాజాగా వెలువడిన తీర్పులో స్కూల్ వారు తమకు ఇచ్చే పరిహారం కన్నా.. విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేపట్టాలన్న నిర్ణయమే తమకు ఎక్కువ సంతోషాన్ని కలిగించినట్లుగా బాధితు విద్యార్థి తల్లిదండ్రులు పేర్కొనటం గమనార్హం.
Tags:    

Similar News