మట్టి కూడా బంగారం అయిపోయిందనే మాట వింటూ ఉంటాం.. ఈ మాట అర్థం మట్టి దొరకట్లేదని! కానీ.. అక్కడ నిజంగానే మట్టి మొత్తం బంగారం అయిపోయింది. ఈ విషయం ఆనోటా.. ఈనోటా అందరికీ పాకిపోయింది. ఇంకే ముందీ? పలుగు, పార పట్టుకుంటున్నారు ఆ ప్రదేశానికి వెళ్లిపోతున్నారు. ఎవ్వరికి కావాల్సినంత బంగారం.. వాళ్లు తవ్వి తెచ్చుకుంటున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది వాస్తవమే!
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వింత విషయం వెలుగు చూసింది. ఆ ప్రాంతంలోని ఓ పెద్ద పర్వతం నిండా బంగారు నిల్వలు ఉన్నట్టు ప్రజలు గుర్తించారు. ఆ పర్వతంలో ఎక్కడ మట్టి తవ్వినా.. అందులో బంగారు ముద్దలు లభిస్తున్నాయి. దీంతో.. సమీప గ్రామానికి చెందిన ప్రజలు మొత్తం వెళ్లి కావాల్సినంత బంగారం తవ్వుకొని వెళ్లిపోతున్నారు.
అక్కడ బంగారం మొత్తం మట్టిలో చిన్న చిన్న ముద్దలుగా ఉంటోంది. దీంతో.. ఆ మట్టిని తవ్వి నీటిలో జల్లెడ పట్టడంతో బంగారం మొత్తం చేతిలో మిగిలిపోతోంది. ఆ విధంగా దొరికినంత బంగారాన్ని దాచుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఇది చూసిన మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా ఆ పర్వతం వద్దకు వెళ్లి, బంగారం తవ్వేందుకు చూస్తున్నారట.
అయితే.. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, ఆ గ్రామంలో బంగారం తవ్వడాన్ని నిషేధించారు. అయినప్పటికీ.. ప్రజలు మాత్రం వారి మాటను ఖాతరు చేయకుండా వెళ్లి బంగారం తవ్వుకుంటున్నారట. ఈ విషయాన్ని అక్కడి మంత్రి ముహిగిర్వా స్వయంగా చెప్పడం విశేషం. కాగా.. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను అహ్మద్ అల్గోబరీ అనే జర్నలిస్టు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడిది తెగ వైరల్ అవుతోంది. ఆహా.. ఇలాంటి కొండ ఒక్కటంటే ఒక్కటి.. మన దగ్గర కూడా ఉంటే ఎంత బాగుండేది కదా..!