సైనికులకు వయాగ్రా టాబ్లెట్స్ ఇచ్చి మరీ రేప్ చేయమన్నారు?

Update: 2022-10-17 10:35 GMT
ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా అక్కడ మారణహోమాన్ని సృష్టించడమే కాదు.. అక్కడి మహిళలపై మానభంగాలను కూడా ప్రోత్సహించిందని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది. ఈ మేరకు ఐరాసా ప్రతినిధి ప్రమీలా ఈ సంచలన ఆరోపణలు చేసింది.

ఉక్రెయిన్ మహిళలపై రష్యా సైనికుల లైంగిక దాడులు ఆ దేశ సైనిక వ్యూహంలో ఒక భాగమని ఆమె ఆరోపించారు. రష్యా సైనికుల వద్ద వయాగ్రా టాబ్లెట్స్ ఉన్నట్టు బాధిత ఉక్రెయిన్ మహిళలు చెప్పారని వివరించారు. బాధితులను అమానవీయంగా మార్చే ఉద్దేశపూర్వక వ్యూహమని ఆమె విమర్శించారు.

ఉక్రెయిన్ లో ఉన్న మహిళలపై కూడా రష్యన్ సైనికులు అత్యాచారం చేసిన సంఘటనలు ఇప్పటికే గతంలోనూ వెలుగులోకి వచ్చాయి. రష్యన్ సైనికులు ఉక్రెయిన్ లోని ఒక ఇంట్లో ప్రవేశించి.. ఆమె కుమారుడిని పక్క గదిలో పెట్టి అత్యాచారం జరిపిన ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేసింది. ఆ బాధిత మహిళ స్వయంగా మీడియా ముందు వాపోయింది.

అదే గదిలో నా నాలుగేళ్ల బిడ్డ గుక్కపట్టి ఏడుస్తున్నాడని.. నా బిడ్డ ఏడుపు ఆపించి మరీ మళ్లీ నన్ను రమ్మన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.  ఆ తర్వాత నన్ను చంపకుండా వదిలేసి వెళ్లిపోయారని ఆ మహిళ మీడియా ఎదుట కన్నీళ్లతో వాపోయింది. తాను కూడా చనిపోతే తన కుమారుడు ఒంటరి అయిపోతాడని.. అందుకే ఆత్మహత్య చేసుకోలేదని మహిళ చెప్పిన మాటలు ఎంతో మందిలో తీవ్ర విషాదాన్ని నింపాయి. తన భర్త శవాన్ని అలాగే వదిలేసి కొడుకుతో సహా పారిపోయి వచ్చానని.. ఆ ప్రాంతం రష్యా సైనికుల ఆధీనంలో ఉండడంతో తన భర్త మృతదేహాన్ని ఖననం చేయడం కుదరదని ఆ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ రష్యన్ సైనికులు తమ భార్యలతో మాట్లాడిన కాల్స్ ను ట్రాప్ చేసింది. దానిలో ఒక సైనికుడు.. అతడి రష్యాలో ఉన్న భార్య మాటలు రికార్డ్ అయ్యాయి. అవి వైరల్ గా మారాయి. ఒక రష్యా సైనికుడు తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడాడు. అందులో నిన్ను చాలా మిస్ అవుతున్నానని భార్యతో చెబుతాడు. దానికి ఆమె నవ్వి.. 'అక్కడ ఉక్రెయిన్ మహిళలు అందంగా ఉంటారు కదా.. నాకు తెలుసు.. కావాలంటే నువ్వు వారిని అత్యాచారం చేసుకో..కానీ ఆ విషయం నాకు మాత్రం చెప్పొద్దు' అని నవ్వుతూ అంటుంది.దానికి ఆ సైనికుడు.. 'నేను ఉక్రెయిన్ మహిళలను అత్యాచారం చేసింది చెప్పొద్దు అంటావ్ అంతేనా?' అని అడుగుతాడు. దానికి అతడి భార్యనవ్వుతూ 'సరే.. యువతులను అత్యాచారం చేసుకో.. కానీ కండోమ్ ధరించి చేయండి' అని జాగ్రత్తలు కూడా చెబుతుంది.  ఈ ఆడియో టేప్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఉక్రెయిన్ మహిళలపై రష్యా సైనికుల అత్యాచారాల పరంపరకు ఇది సాక్ష్యంగా నిలుస్తోంది.  ఉక్రెయిన్ యుద్ధం ఎన్నో విషాదాలను నింపుతోంది. ఎన్నో పగలు, ప్రతీకారాలకు వేదిక అవుతోంది. రోజుకో కథ బయటకు బయటపడుతోంది.  ఎంతో మంది మహిళలు మాన ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నారుల మరణాలు వేల సంఖ్యలో ఉంటున్నాయి. రష్యా బాంబు దాడులకు దేశం ఖాళీకాగా.. ఉన్నవాళ్లు అంతా బలైపోతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News