ఆ హైడ్రోజన్ బాంబుకు అమెరికానే వణికింది..అణు బాంబు కన్నా 500 రెట్ల శక్తివంతమైనది

Update: 2020-08-23 04:00 GMT
ప్రపంచంలో ఇప్పటివరకు రెండు అతి పెద్ద యుద్ధాలు జరిగాయి. అవే మొదటి రెండవ, ప్రపంచ యుద్ధాలు. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు యూరప్ దేశాల మధ్య జరిగింది. జర్మనీ పోలెండ్ ను ఆక్రమించుకోవడంతో రెండో ప్రపంచ యుద్ధానికి కారణం అయింది. ఆ యుద్ధంలో క్రమేణా ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా పాల్గొన్నాయి. ఇది 1939 నుంచి 1945 వరకు జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో యంత్రాల వినియోగం తక్కువ. యుద్ధంలో సైనికులే స్వయంగా పాల్గొని తుపాకీ కాల్పులు జరపడం, చేతితోనే బాంబులు విసరడం వంటివి చేశారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తరువాత రెండో ప్రపంచ యుద్ధం కల్లా సాంకేతికంగా చాలా మార్పులు వచ్చాయి. ప్రపంచ దేశాలన్నీ ఆయుధాలను సమకూర్చుకోవడం మొదలుపెట్టాయి. లక్షలాది యుద్ద ట్యాంకులు, సైనిక విమానాలు. సబ్ మెరైన్ లు వంటి అధునాతన ఆయుధ సంపత్తిని అన్ని దేశాలు సమకూర్చుకున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం కల్లా జరిగిన అతి పెద్ద మార్పు అణు బాంబులే.

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాలు అణు బాంబులను రూపొందించుకున్నాయి. ఇప్పటి వరకు అణు బాంబులు పడ్డ దేశం ఒక్క జపాన్ మాత్రమే. ఆ దేశంలోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణు బాంబుల ప్రయోగం జరగడంతో అవి సర్వనాశనం అయ్యాయి. లక్షలాది జనం కన్నుమూశారు.ఆ ప్రాంతపు నేలలు అణు బాంబు ప్రభావానికి నిస్సారంగా మారిపోయాయి. గడ్డి పోచ కూడా ఆ ప్రాంతంలో ఇక పెరగదు. జపాన్ పై అణు బాంబు ప్రయోగం తర్వాత అవి ఎంత శక్తిమంతమైనవో ఇతర దేశాలు గుర్తించాయి.

ఆ తర్వాత అమెరికా రెండు అణు బాంబులను సిద్ధం చేయగా.. సోవియట్ యూనియన్ ఏకంగా ప్రపంచంలోనే అతి శక్తివంతమైన రెండు హైడ్రోజన్ బాంబులను సిద్ధం చేసింది. వాటిలో ఒకదాని పేరు 'ఏఎన్ 602' హైడ్రోజన్ బాంబు. ఈ బాంబు అణు బాంబు కన్నా ఐదు వందల రెట్ల శక్తిమంతమైనది. అయితే అమెరికా కానీ సోవియట్ యూనియన్ కానీ ఒకదానిపై మరొకటి ఈ బాంబులను తేల్చుకో లేదు. సోవియట్ యూనియన్ మాత్రం న్యూ ఐలాండ్ లో ఒక బాంబును పేల్చింది. మానవులు పేల్చిన అతి శక్తివంతమైన బాంబుల్లో ఇది ఒకటి. ఇంకో బాంబును సోవియట్ యూనియన్ బ్యాక్ అప్ గా ఉంచుకుంది. సోవియట్ యూనియన్ సిద్ధం చేసిన ఈ అణుబాంబు కు అమెరికా కూడా భయ పడిందని చెబుతారు.
Tags:    

Similar News