కొత్త స్ట్రెయిన్​ ప్రాణాంతకం.. ఆస్పత్రులు కూడా సరిపోవు..!

Update: 2020-12-25 12:30 GMT
కరోనా మహమ్మారి సృష్టించిన ఉత్పాతం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్​ పంపిణీ కూడా ప్రారంభించారు. అమెరికా, బ్రిటన్​ మరికొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్​ మొదలుపెట్టారు. తొలిదశలో ఆరోగ్యకార్యకర్తలకు వ్యాక్సిన్​ ఇస్తున్నారు. వ్యాక్సిన్​ రావడంతో ప్రపంచదేశాల్లో కరోనాపై భయం పోయింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. ఇంతలోనే బ్రిటన్​లో కొత్త స్ట్రెయిన్​ ముంచుకొచ్చింది.

అయితే ఇప్పటికే బ్రిటన్​లో లాక్​డౌన్​ విధించగా పలుదేశాలు.. బ్రిటన్​కు విమానాలను రద్దు చేశాయి. అయితే బ్రిటన్​లో విజృంభిస్తున్న స్ట్రెయిన్​ ఎంతో డేంజర్​ అని కొందరు శాస్త్రవేత్తలు అంటుంటే.. మరికొందరేమే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్​ కొత్త స్ట్రెయిన్​ మీద పనిచేస్తుందా? లేదా? అన్న విషయం కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్​ శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధన భయాందోళన కలిగిస్తున్నది.

లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ సైంటిస్టులు కొత్త స్ట్రెయిన్​పై పరిశోధన చేపట్టారు. వారు చెప్పిన ప్రకారం.. కొత్త వైరస్​ ఎంతో డేంజర్​. ప్రాణాంతకం. అంతేకాక పాత వైరస్​ కంటే కొత్త వైరస్​ రెట్టింపు వేగంగా విస్తరిస్తుంది. కరోనా వైరస్​ జన్యుమార్పిడి చెంది కొత్త స్ట్రెయిన్​గా రూపాంతరం చెందింది కాబట్టి ఇది ఎంతో డేంజర్​ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కొత్త వైరస్​ వల్ల మరణించేవారి సంఖ్య ఎక్కువ ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాక కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తే ఆస్పత్రులు కూడా సరిపోవని వారు హెచ్చరిస్తున్నారు. కొత్త వైరస్​తో ఇప్పటికే ప్రపంచదేశాలు అలర్టయ్యాయి. భారత్​ కూడా బ్రిటన్​ నుంచి వచ్చే విమానాలను రద్దుచేసింది. మరోవైపు ఇటీవల బ్రిటన్​ నుంచి తెలంగాణ రాష్ట్రానికి 120 మంది వచ్చారు. వారిలో ఏడుగురికి కరోనా సోకింది. అయితే ఇది పాత కరోనానా.. లేక కొత్త స్ట్రెయినా అన్న విషయంపై క్లారిటీ లేదు.
Tags:    

Similar News