ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య

Update: 2020-06-20 06:00 GMT
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని కొందరు.. తక్కువ మార్కులు వచ్చాయని మరికొందరు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఐదుగురు విద్యార్థులు పరీక్షల ఫలితాలపై మనస్థాపంతో ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది.

తాజాగా శుక్రవారం తెలంగాణ ఇంటర్ ఫలితాలను తట్టుకోలేక ఐదుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. సిద్దిపేట, వికారాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.

నాగర్ కర్నూల్ కు చెందిన కల్వకోల్ గ్రామానికి చెందిన సోని (16) ఇంటర్ ఫస్టియర్ లో 314 మార్కులు సాధించి మార్కులు తక్కువగా వచ్చాయని మనస్తాపంతో పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకుంది..

ఇక మహబూబాబాద్ జిల్లా చెంద్రుగూడెంకు చెందిన సోలం సరుయు (16) మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో సూసైడ్ చేసుకుంది.

వికారాబాద్ జిల్లా భజ్యానాయక్ తండాకు చెందిన నిఖిత ఇంటర్ సెంకడియర్  లో ఫెయిల్ కావడంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  ఇక సిద్దిపేట జిల్లా క్యాసారం గ్రామానికి చెందిన శ్రావణి ఫెయిల్ అవ్వడంతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.  గజ్వేల్ పట్టణానికి చెందిన  అభి కూడా ఇంటర్ ఫెయిల్ కావడంతో శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Tags:    

Similar News