ఆఫ్ఘనిస్తాన్ ను చేతుల్లోకి తీసుకన్న తాలిబన్లు వారి అకృత్యాలని కొనసాగిస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు పూర్తిగా వెనుదిరిగాయి. దీనితో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు జరుపుకున్నారు. అయితే, తాలిబన్లు పైకి శాంతి మంత్రం జపిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కొనసాగుతున్నాయి. కాబూల్ ను అక్రమించిన నాటి నుంచి తాలిబన్లు మరింతగా రెచ్చిపోతున్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేసినవారి కోసం గాలింపు చేపట్టారు.
వారిని హింసలకు గురిచేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అఫ్గాన్ లో మహిళలపై పలు ఆంక్షలు విధిస్తున్నారు. అఫ్గాన్ లో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్లు వెళ్లిన కొద్ది గంటల్లోనే, అక్కడ తాలిబన్ల అరాచకం రాజ్యమేలుతున్నదని చెప్పడానికి సాక్ష్యంగా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తిని తాడు సాయంతో హెలికాఫ్టర్ నుంచి వేలాడదీశారు. కాందాహార్ లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా సమాచారం. చాలా మంది ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
తాలిబాన్లు ఒక వ్యక్తిని చంపి కందహార్ ప్రాంతంలో అమెరికన్ బ్లాక్ హాక్ హెలికాప్టర్ నుంచి వేలాడదీశాడని కొందరు జర్నలిస్టులు పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై అమెరికాలో రాజకీయ దురమారం సైతం చెలరేగింది. కానీ, ఇది తాలిబన్ల అకృత్యం కాదు అని , తాలిబన్ల సంబురం అని ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. అమెరికా దళాలు ఖాళీ చేశాక, అమెరికా మిలిటరీ యుద్ధ సామాగ్రి మొత్తాన్ని తాలిబన్లు స్వాధీనపర్చుకున్నారు.
సంబురంగా జెండాలు ఎగరేసి వేడుకలు చేసుకున్నారు. కాందహార్ లో జెండాను ఎగరేయడానికి బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్ ద్వారా ఓ ఫైటర్ ను ఉపయోగించుకున్న సందర్భం అది. టబుసమ్ రేడియో అనే పేజీ నుంచి వైరల్ అయ్యింది. అఫ్గన్ రేడియో స్టేషన్ అగస్టు 30న టెలిగ్రామ్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. కాందహార్ లోని గవర్నర్ కార్యాలయం మీద జెండా ఎగరేయడానికి ఆ తాలిబన్ మెంబర్ ప్రయత్నించాడు. ఫుల్ లెంగ్త్ వీడియోలో చేతులు ఊపడం కూడా చూడొచ్చు. అమెరికా భద్రత దళాల ఉపసంహరణ సందర్భంగా తాలిబన్ల సంబురంలో భాగంగా ఈ ఘటన జరిగింది.