రైతుల‌ను అడ్డుకోవ‌డ‌మే టార్గెట్‌.. అందుకే బ్రిడ్జి మూసేశారా?

Update: 2022-10-15 10:37 GMT
రాజ‌ధాని రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌ను నిలువ‌రించడ‌మే..అజెండా.. అడుగ‌డుగునా.. వారి పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌డ‌మే అజెండా. ఏకైక రాజ‌ధాని కోసం.. తాము ఇచ్చిన భూముల అభివృద్ధి కోసం రోడ్డెక్కిన రైత‌న్న‌ల‌పై ఏదో ఒక ర‌కంగా.. విరుచుకుప‌డ‌డ‌మే ధ్యేయంగా.. ఏపీ అధికార పార్టీ వైసీపీ చేస్తున్న అరాచ‌కాల్లో అత్యంత కీల‌క‌మైన ఘ‌ట్టం వెనుక ఉన్న అస‌లు నిజం ఇప్పుడు బ‌య‌ట ప‌డింది. ప్ర‌స్తుతం రాజ‌ధాని రైతులు పాద‌యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోవారు.. ఈ నెల 17న రాజ‌మండ్రిలోకి ప్ర‌వేశించాల్సి ఉంది.

దీనికి ఉన్న ఏకైక మార్గం.. ధ‌వ‌ళేశ్వ‌రం వ‌ద్ద ఉన్న రోడ్ క‌మ్ రైల్ బ్రిడ్జ్‌. గ‌తంలో వైసీపీ అధినేతగా రాష్ట్రంలో ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర చేప‌ట్టినప్పుడు .. జ‌గ‌న్ కూడా ఇదే బ్రిడ్జిపై వెళ్లారు. అప్ప‌ట్లో ఈ బ్రిడ్జి కిట‌కిట‌లాడిపోయింద‌ని.. అనుకూల మీడియా తెగ ప్ర‌చారం చేసుకుంది. అయితే.. ఇప్పుడు రైతులు కూడా..

అదేబ్రిడ్జిని దాటుకుని వెళ్తే త‌ప్ప‌.. వారు ఉత్త‌రాంధ్ర‌లోకి ప్ర‌వేశించే అవ‌కాశం లేదు. అంతేకాదు.. దీనిని దాటితే త‌ప్ప‌.. వారు త‌మ గ‌ళాన్ని వినిపించే ఛాన్స్ కూడా లేదు. ఇక‌, వీరి పాద‌యాత్ర‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న వైసీపీ ప్ర‌భుత్వం.. ఈ అవ‌కాశాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది.

దీనిలోభాగంగా.. స‌ద‌రు రోడ్ క‌మ్ రైల్‌బ్రిడ్జిని మూసేస్తున్న‌ట్టు.. తూర్పుగోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ ఒక ఉత్త‌ర్వు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇక్క‌డ మ‌ర‌మ్మ‌తులు చేయాల్సి ఉంది.. సో..అందుకే.. బ్రిడ్జిని కొన్ని రోజుల పాటు మూసేస్తున్నామ‌న్నారు. దీంతో అంద‌రూ.. స‌రే అనుకున్నారు. కానీ, ఎక్క‌డో అనుమానం మాత్రం ర‌గులుతూనే ఉంది. చివ‌ర‌కు.. ఇదే నిజ‌మైంది. ఎందుకంటే..ఈ బ్రిడ్జి నిర్వ‌హ‌ణ‌కు ఏపీకి చెందిన రెండు శాఖ‌లు..జ‌ల‌వ‌న‌రులు, ఆర్ ఆండ్ బీలు చూస్తున్నాయి. అదేస‌మ‌యంలో కేంద్ర రైల్వే శాఖ కూడా ప‌ర్య‌వేక్షిస్తుంది.

అయితే.. ఈ రెండు శాఖ‌ల నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. పైగా.. బ్రిడ్జికి మ‌ర‌మ్మ‌తులు చేస్తున్న‌ది నిజ‌మైతే.. రైల్వేశాఖ కూడా అప్ర‌మ‌త్తం అవ్వాలి. ఇక్క‌డ రైళ్ల‌ను నిలిపి వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టన ఇవ్వాలి. అదేవిధంగా.. ప‌నుల‌కు టెండ‌ర్లు పిల‌వాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. ఈ బ్రిడ్జి మ‌ర‌మ్మ‌తులుచేసేందుకు..

శాశ్వ‌త సిబ్బంది ఉన్నారు. పోనీ.. వారి హ‌డావుడి అయినా.. క‌నిపించాలి. ఈ రెండు క‌నిపించ‌లేదు. పైగా రైళ్లు తిరుగుత‌న్నాయి. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. ఖ‌చ్చితంగా.. ఈ నిలిపివేత వెనుక‌.. రాజ‌ధానిరైతుల‌ను నిలువ‌రించే కుట్ర ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News